Share News

17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఎస్ఆర్

ABN , Publish Date - Oct 15 , 2026 | 09:28 PM

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఎస్ఆర్

ఇంటర్‌నెట్ డెస్క్: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2027 జనవరి 1 అర్హత తేదీగా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) చేపట్టాలని నిర్ణయించింది. 2027 జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 అర్హత తేదీలకు కూడా ముందస్తు దరఖాస్తులను స్వీకరించనుంది. 2026 నవంబర్ 2లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలని ఆదేశించింది. 2026 నవంబర్ 12న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనుండగా.. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 28 లోగా అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కారం చేయనున్నారు. జనవరి 4న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. తర్వాత కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ, చిరునామా మార్పులకు అవకాశం కల్పిస్తారు.


అర్హులైన యువత, తొలిసారి ఓటు హక్కు పొందే వారికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కాకూడదని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. అనర్హుల పేర్లు తొలగించడంతో పాటు మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారి వివరాలను పరిశీలించాలని పేర్కొంది. ఒకే వ్యక్తి పేరుతో బహుళ ఎంట్రీలు ఉంటే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ముందుగా నిర్దేశిత విధానాలు పాటించాలని స్పష్టం చేసింది. ఆధార్ నంబర్ ఇవ్వలేదనే కారణంతో ఓటరు నమోదు దరఖాస్తును తిరస్కరించరాదని తెలిపింది. ఓటరు నమోదు, వివరాల సవరణ కోసం ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తుల కోసం voters.eci.gov.in పోర్టల్, ECINET యాప్‌ను వినియోగించుకోవాలని సూచించింది. పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు రెండు కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఒకే ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల పేర్లు సాధ్యమైనంతవరకు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని సూచించింది.


Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 15 , 2026 | 09:47 PM