నవరాత్రి వేడుకలు చూసి రొమేనియన్ పర్యాటకురాలు ఎమోషనల్
ABN , Publish Date - Oct 15 , 2026 | 08:10 PM
మన దేశంలో దసరా నవరాత్రి వేడుకలు ఎంత వైభవంగా నిర్వహిస్తారో అందరికీ తెలిసిందే. అక్టోబర్ వచ్చిందంటే చాలు.. దేశమంతా నవరాత్రి వేడుకలతో నిండిపోతుంది. ఈ సందర్భంగా గర్బా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యువతీ యువకులు, పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ గర్బా డ్యాన్సులు చేస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: మన దేశంలో దసరా నవరాత్రి వేడుకలు ఎంత వైభవంగా నిర్వహిస్తారో అందరికీ తెలిసిందే. అక్టోబర్ వచ్చిందంటే చాలు.. దేశమంతా నవరాత్రి వేడుకలతో నిండిపోతుంది. ఈ సందర్భంగా గర్బా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యువతీ యువకులు, పెద్దలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ గర్బా డ్యాన్సులు చేస్తారు. కాగా.. రొమేనియన్కు చెందిన పర్యాటకురాలు, మారియా అలెగ్జాండ్రా అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తోంది. నవరాత్రి వేడుకలను చూసి ఆమె తీవ్రంగా భావోద్వేగానికి గురైంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘నా జీవితంలో ఇలాంటి వేడుకలను ఇంతకుముందెన్నడూ చూడలేదు. పండుగ సమయంలో నేను భారత్లో పర్యటించడం ఆనందంగా ఉంది. ఇక గర్బా డ్యాన్స్ అద్భుతం. చూడండి.. పిల్లలు, పెద్దలు, పురుషులు, మహిళలు ఎంత అందంగా డ్యాన్స్ చేస్తున్నారో. వయసుతో పని లేకుండా అందరూ గర్బాలో పాల్గొంటున్నారు. తొమ్మిది రాత్రులు దుర్గమ్మకు ఇక్కడి భక్తులు అంకితం ఇస్తారు. ప్రతిఒక్కరూ గర్బాతో దుర్గమ్మను సేవిస్తున్నారు. గర్బా ఒక డ్యాన్స్ మాత్రమే కాదు. అది కూడా పూజతో సమానం. గర్బా చేయడం ద్వారా భక్తులు అమ్మవారిని పూజిస్తున్నారు. అది కూడా భక్తియే. వావ్.. అద్భుతం’ అని అలెగ్జాండ్రా పేర్కొంది.
గర్బా చూసి తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని, తన కళ్ల నుంచి నీరు వచ్చాయని అలెగ్జాండ్రా చెప్పింది. భారతీయ సంస్కృతిపై తనకు ఉన్న అభిమానం వల్లే తన కళ్ల నుంచి నీరు వచ్చి ఉండవచ్చని తెలిపింది. కాగా.. త్వరలో తాను భారత్ను వీడివెళుతున్నానని, తాను చాలా మిస్ అవుతున్నట్లుందని వెల్లడించింది. తాను చూసిన దృశ్యాలన్నీ తనకు ఒక మధురానుభూతిగా మిగిలిపోతాయని చెప్పింది. ఇక, అలెగ్జాండ్రా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారతీయ సంస్కృతిని ఆమె చాలా బాగా అర్థం చేసుకుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ‘గర్బాను మీరు ఎంజాయ్ మాత్రమే చేయలేదు. ఆ వేడుకల్లో మీరు జీవించారు. ఒకసారి గుజరాత్ రండి’ అని ఒక యూజర్ అన్నారు. మరో యూజర్ గర్బా గురించి వివరించారు. ‘గర్బా అంటే తల్లిగర్భం అని అర్థం. తల్లిగర్భాన్ని పూజించే విధానమే గర్భా. మొత్తం జగత్తుకు జన్మనిచ్చిన తల్లికి చేసే వందనమే గర్బా’ అని మరో యూజర్ తెలిపారు.
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు