కనౌట్ ప్రాంతంలో సీజేపీ ఆందోళనకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:35 PM
ఢిల్లీలో కనౌట్ ప్రాంతంలోని సెంట్రల్ పార్కులో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈనెల 16న ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో కనౌట్ ప్రాంతంలోని సెంట్రల్ పార్కులో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈనెల 16న ఆందోళన కార్యక్రమాలు నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఆందోళనలు నిర్వహించకుండా వారిని అడ్డుకోలేమని పేర్కొంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు పోలీసుల నుంచి హామీ తీసుకుంది. సీజేపీ ఆందోళన సమయంలో కనౌట్ ప్రాంతంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తామని, వాటికి భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
కనౌట్ ప్రాంతంలో సీజేపీ ప్రదర్శనల సమయంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాలని ఆ ప్రాంతంలో వ్యాపారం చేసే వ్యక్తి వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మతో కూడిన బెంచ్ విచారించింది. ప్రస్తుతం దసరా పండగ సీజన్ కావడంతో కనౌట్ ప్రాంతంలో వ్యాపారుల బిజినెస్పై సీజేపీ ఆందోళనల ప్రభావం పడకుండా చూడాలని పిటిషనర్ తరపు అడ్వొకేట్ కోరారు. కాగా.. సీజేపీ కార్యక్రమాలను నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, అలాగే పిటిషనర్ సమస్యను కూడా పరిష్కరిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. బెంచ్కు తెలిపారు. సీజేపీని నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ అడ్వొకేట్ చేసిన వినతిని బెంచ్ తిరస్కరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కనౌట్ ప్రాంతంలో సీజేపీ నిరసన ప్రదర్శనలకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది.
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు