ఢిల్లీలో పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. రంగంలోకి పోలీసులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:19 PM
దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు గురువారం ఉదయం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలల యాజమాన్యాల సమాచారం మేరకు పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పలు పాఠశాలలకు గురువారం ఉదయం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలల యాజమాన్యాల సమాచారం మేరకు పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఆయా పాఠశాలలకు వెంటనే చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా, రెండు రోజుల క్రితమే ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న పాఠశాలలకూ ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 12న రోహిణిలోని వెంకటేశ్వర్ గ్లోబల్ స్కూల్, మౌంట్ అబు పబ్లిక్ స్కూల్కు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో సంబంధిత బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించాయి. అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
తాజాగా మరోసారి పలు పాఠశాలలకు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో విద్యాసంస్థల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారు? ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీలో ఇంటర్నెట్ నిలిపివేతపై సుప్రీంకోర్టుకు కేంద్రం క్షమాపణలు..
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మత మార్పిడితో రిజర్వేషన్ వర్తించదని స్పష్టం