Share News

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:21 PM

నగల కోసం ఇద్దరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బుధవారం జరిగింది.

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

ఇంటర్నెట్ డెస్క్: నగల కోసం ఇద్దరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బుధవారం జరిగింది. లాల్‌జీభాయ్ సర్ధారా అనే వ్యాపారవేత్త బ్యాగ్‌లో కోటిన్నర రూపాయల విలువైన నగలను పెట్టుకుని తన నివాసానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అయితే ఆయనను గమనించిన ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. లాల్‌జీభాయ్ నుంచి ఆ బ్యాగ్‌ను బలవంతంగా లాక్కున్నారు. అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారు. తన నగలతో పారిపోతున్న ఆ ఇద్దరినీ లాల్‌జీభాయ్ వెంబడించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయన నుంచి తప్పించుకునేందుకు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో లాల్‌జీభాయ్ దారుణంగా గాయపడ్డారు. స్థానికులు సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.


కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ పరిశీలించారు. కొన్ని సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన గుజరాత్‌లోని వ్యాపారస్థుల్లో ఆందోళనలను పెంచుతోంది. గత కొంత కాలంగా అక్కడ ఇలాంటి ఘటన తరచూ జరుగుతున్నాయి. తమ భద్రతపై వ్యాపారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మత మార్పిడితో రిజర్వేషన్ వర్తించదని స్పష్టం

రాజస్థాన్‌లో పాక్ డ్రోన్ ఆయుధాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్..

Updated Date - Oct 15 , 2026 | 01:21 PM