Share News

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:51 PM

ఐపీఎల్ మెగా టోర్నీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ సపోర్ట్ స్టాఫ్‌ను మరింత పటిష్ఠం చేసుకుంది. తమ తొలి ఐపీఎల్ టైటిల్ సాధన లక్ష్యంగా దిగ్గజ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించింది.

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!
Yuvraj Singh

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ (IPL 2027) మెగా టోర్నీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తమ సపోర్ట్ స్టాఫ్‌ను మరింత పటిష్ఠం చేసుకుంది. తమ తొలి ఐపీఎల్ టైటిల్ సాధన లక్ష్యంగా దిగ్గజ ఆటగాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇందులో భాగంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టగా.. అతడి సారథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మరో దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) అసిస్టెంట్ కోచ్‌ , బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు.


ఈ నియామకంపై ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో యువరాజ్ సింగ్ తన అనుభవాలను పంచుకున్నాడు. 'నన్ను నీకు అసిస్టెంట్‌గా ఉంటావా అని గంగూలీ అడిగారు. దీంతో నేను.. గత 25 ఏళ్లుగా నేను నీకు అసిస్టెంట్‌గానే ఉంటున్నాను కదా. కాబట్టి, ఇప్పుడు కూడా అదే పని చేయాల్సి ఉంటుందని సరదాగా బదులిచ్చాను' అని యువీ నవ్వుతూ గుర్తుచేసుకున్నాడు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లకు మెంటర్‌గా వ్యవహరించిన అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పూర్తి జట్టు వాతావరణంలో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.


2011 వన్డే వరల్డ్ కప్ హీరో అయిన యువరాజ్.. గంగూలీ నాయకత్వ శైలిని ప్రశంసించాడు. కష్టకాలంలో జట్టును ఎలా ఐక్యంగా ఉంచాలో, విదేశాల్లోనూ విజయాలు సాధించగలమనే నమ్మకాన్ని నాటి కెప్టెన్ గంగూలీ తమలో నింపారని గుర్తుచేసుకున్నాడు. గంగూలీ తనకు ఎప్పుడూ పెద్ద అన్నలా మద్దతుగా నిలిచేవాడు, సెలక్షన్ విషయాలను అర్థం చేసుకోవడంలోనూ, అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగడంలోనూ ఎంతో మార్గదర్శకత్వం వహించారని యువీ పేర్కొన్నాడు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాబోయే సీజన్‌లో ఎలా రాణిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 15 , 2026 | 05:05 PM