Share News

తెలంగాణలో అక్రమ ఔషధ విక్రయాలపై TG SAFE కొరడా

ABN , Publish Date - Oct 15 , 2026 | 09:32 PM

తెలంగాణలో అక్రమ ఔషధ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు TG SAFE అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని ఏడు జోన్ల పరిధిలో మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

తెలంగాణలో అక్రమ ఔషధ విక్రయాలపై TG SAFE కొరడా
TG SAFE Telangana

హైదరాబాద్‌, అక్టోబర్ 15: తెలంగాణలో అక్రమ ఔషధ విక్రయాలపై TG SAFE అధికారులు కొరడా ఝళిపించారు. CURE ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఏడు జోన్ల పరిధిలో సరోర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట, అంబర్‌పేట ప్రాంతాల్లోని మెడికల్ షాపులను తనిఖీ చేశారు. ముఖ్యంగా ఆల్ప్రాజోలం, నైట్రాజెపామ్, ట్రామడాల్ టాబ్లెట్ల విక్రయాలపై అధికారులు దృష్టి సారించారు. వీటితో పాటు కోడైన్‌తో కూడిన దగ్గు సిరప్‌లు, టాపెంటడాల్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్ తదితర ఔషధాల విక్రయాల తీరును పరిశీలించారు.


రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనలను ఉల్లంఘించిన 137 మెడికల్ షాపులను అధికారులు గుర్తించారు. అనుమతులు లేకుండా మత్తు కలిగించే ఔషధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి, ఆయా షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటిస్తున్నారా? వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా విక్రయాలు జరుగుతున్నాయా? అనే అంశాలపై తనిఖీల్లో ప్రత్యేకంగా పరిశీలించారు. అక్రమ ఔషధ విక్రయాలను నియంత్రించడంతో పాటు మత్తు కలిగించే మందులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకునే దిశగా అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌లు.. జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

ఎల్‌నినో కోవిడ్‌ లాంటి సంక్షోభం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 09:48 PM