Share News

రాహుల్‍ను వైస్ కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం కాదు: మాజీ క్రికెటర్

ABN , Publish Date - Aug 23 , 2026 | 09:45 AM

అఫ్గానిస్థా‏న్‌తో టీమిండియా ఏకైక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు భారత్ జట్టును ప్రకటించినప్పుడు వైస్ కెప్టెన్ విషయంలో మార్పు జరిగింది. అయితే..

రాహుల్‍ను వైస్ కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం కాదు: మాజీ క్రికెటర్
Aakash Chopra

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల అఫ్గానిస్థా‏న్‌తో టీమిండియా ఏకైక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు భారత్ జట్టును ప్రకటించినప్పుడు వైస్ కెప్టెన్ విషయంలో మార్పు జరిగింది. అప్పటి వరకు వైస్ కెప్టెన్‌గా ఉన్న రిషభ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు కూడా రాహుల్‌లే శుభ్‍మన్ గిల్‌కు డిప్యూటీగా ఉన్నాడు. ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైస్ కెప్టెన్ విషయంలో బీసీసీఐ నిర్ణయం సరైనది కాదని పరోక్ష విమర్శించాడు.


ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. కెప్టెన్‌గా ఉన్న గిల్‌కు కాస్త సమవయస్కుడిని వైస్ కెప్టెన్‌గా నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. గిల్‌ తర్వాత జట్టుకు నాయకత్వం వహించేది వైస్‌ కెప్టెన్‌ పదవిలో ఉన్న ప్లేయరేనని.. కేఎల్‌ మాత్రం ఇప్పటికే ఆ దశను దాటేశాడని చోప్రా వెల్లడించాడు.


‘వైస్‌ కెప్టెన్సీ విషయంలో జరుగుతోన్న చర్చకు నేను అంగీకరిస్తా. ఎలా రాహుల్‌ను శుభ్ మన్ గిల్‌కు డిప్యూటీగా ఉంచారో అర్థం కావడం లేదు. వీరిద్దరి మధ్య దాదాపు 8 ఏళ్లు గ్యాప్ ఉంది. ఇక్కడ రాహుల్ ను తక్కువ చేయడం లేదు. అతడు మంచి కెప్టెన్సీ సామర్థ్యం కలిగిన ప్లేయర్. కానీ, గిల్‌ తర్వాత సారథిగా వచ్చేంత దశలో మాత్రం కేఎల్ (KL Rahul) లేడని నేను అభిప్రాయపడుతున్నాను. అందుకే, వైస్ కెప్టెన్ గా గిల్ కి సమ వయస్కుడిని పెడితే బాగుండేది’ అని చోప్రా పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ఫుట్‌బాల్‌లోకి ఉసేన్ బోల్ట్ రీఎంట్రీ?

డబ్ల్యూటీసీలో నంబర్ వన్ బౌలర్‌గా మిచెల్ స్టార్క్

Updated Date - Aug 23 , 2026 | 11:43 AM