అమెరికా కొత్త భూభాగం.. మరోసారి మ్యాప్‌ను షేర్ చేసిన డొనాల్డ్ ట్రంప్..
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:53 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హోర్ముజ్ జలసంధిపై సంచలన పోస్ట్ చేశారు. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. కీలక హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఓ మ్యాప్‌ను షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హోర్ముజ్ జలసంధిపై సంచలన పోస్ట్ చేశారు. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. కీలక హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఓ మ్యాప్‌ను షేర్ చేశారు. హోర్ముజ్ జలసంధిని 'కొత్త అమెరికా భూభాగం'గా పేర్కొంటూ రూపొందించిన మ్యాప్‌ను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో మళ్లీ పోస్ట్ చేశారు (Donald Trump about Strait of Hormuz).
ఆగస్టు 18న ఇదే మ్యాప్‌ను తొలిసారి పంచుకున్న ట్రంప్.. తాజాగా మరోసారి దానిని పోస్ట్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఇరాన్‌ను ఓడించిన తర్వాత హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని ట్రంప్ ఆగస్టు 15న తొలిసారి వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పటికే ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణ సాధించిందని కూడా ఆయన పేర్కొన్నారు. తాజాగా మరోసారి అదే మ్యాప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు (Trump Hormuz Map).
ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతోందని ఇరాన్ చెబుతోంది (Strait of Hormuz Crisis). యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి ఈ కీలక జలమార్గాన్ని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి తీసుకుని, రవాణా రుసుములు చెల్లించిన తర్వాతే నౌకలు జలసంధి గుండా వెళ్లాలని ఇరాన్ నిబంధనలు విధించింది.
అమెరికా తన వైఖరిని మార్చి, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు హోర్ముజ్ తెరుచుకోదని ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధిపతి మొహ్సెన్ రెజాయీ స్పష్టం చేశారు. అమెరికా ఆర్థిక ఆంక్షలు, దిగ్బంధాన్ని కొనసాగిస్తే తమ స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఒడిశా తీరానికి సమీపంలో కార్గో నౌక మునక.. 22 మంది గల్లంతు..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..