Share News

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఆర్యవీర్ సెహ్వాగ్.. వీరూ ఎంతో గర్వపడుతుంటాడు: గంగూలీ

ABN , Publish Date - Nov 14 , 2026 | 09:30 PM

పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి అండర్-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ టోర్నీలో అద్బుత ప్రదర్శన కనబర్చిన క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు.

‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఆర్యవీర్ సెహ్వాగ్.. వీరూ ఎంతో గర్వపడుతుంటాడు: గంగూలీ
Aryaveer Sehwag

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించి అండర్-19 ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న భారత యువ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ టోర్నీలో అద్బుత ప్రదర్శన కనబర్చిన క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో 361 పరుగులతో రాణించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు టీమిండియా కుర్రాళ్ల పోరాట పటిమను కొనియాడారు. ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.


వావ్ వాట్ ఏ మ్యాచ్!: వీరేంద్ర సెహ్వాగ్

‘వావ్ వాట్ ఏ మ్యాచ్! ఎంత అద్భుతమైన ! అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ పాకిస్థాన్‌ను ఓడించాలంటే ఎంతో పట్టుదల, పోరాట పటిమ ఉండాలి. లక్ష్య(80), ఆర్యవీర్(58) రాణించారు. ఆ తర్వాత మనల్ చౌహాన్(47), మోహిత్ ఉల్వా(49*) అద్భుతం చేశారు. ఇది నమ్మశక్యం కాని విజయం. ఈ యువ ఛాంపియన్లను చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ చేశాడు.


యువ జట్టుకు అభినందనలు: సౌరభ్ గంగూలీ

‘భారత అండర్-19 జట్టుకు అభినందనలు. అద్భుతమైన ప్రదర్శన చేశారు. యువ సెహ్వాగ్ ఈ టోర్నీలో ఎంతో గొప్పగా ఆడాడు! జట్టులోని ప్రతి ఒక్కరూ బాగా రాణించారు. వీరూ(వీరేంద్ర సెహ్వాగ్) ఎంతో గర్వపడుతుంటాడు’ అని గంగూలీ పేర్కొన్నాడు.


అద్భుతం చేశారు: వీవీఎస్ లక్ష్మణ్

‘కుర్రాళ్లకు హృదయపూర్వక అభినందనలు. ఒత్తిడిలో మీరు చూపిన పట్టుదల, పోరాటం, ప్రశాంతత అద్భుతం. కీలక సమయంలో గొప్ప నమ్మకం, సంకల్పంతో ఆడారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తీరుపై గర్వంగా ఉంది. ఇలాగే నేర్చుకుంటూ మరింత ఉన్నత స్థాయికి ఎదగండి’ అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

అండర్ 19 ఆసియా కప్ మనదే.. ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ విజయం

బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడమే మాకు అసలైన పరీక్ష: కివీస్ స్టార్ ప్లేయర్

Updated Date - Nov 14 , 2026 | 09:30 PM