Share News

అండర్ 19 ఆసియా కప్ మనదే.. ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ విజయం

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:41 PM

అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత యువ ఆటగాళ్లు అదరగొట్టారు. పాకిస్థాన్‌పై ఒక్క వికెట్ తేడాతో టీమిండియా విజయం సాధించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అండర్ 19 ఆసియా కప్ మనదే.. ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్ విజయం
India vs Pakistan U19 Final

ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత యువ ఆటగాళ్లు అదరగొట్టారు. పాకిస్థాన్‌పై ఒక్క వికెట్ తేడాతో టీమిండియా విజయం సాధించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్.. 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు లక్ష్య రాజేశ్(80), ఆర్యవీర్ సెహ్వాగ్(58) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గెలుస్తామా..? అనుకున్న మ్యాచ్‌ను ఆరో స్థానంలో వచ్చిన మనాల్ చౌహాన్(47) గాడిలో పెట్టాడు.


ఆ తర్వాత ఆఖరిలో వచ్చిన మోహిత్ ఉల్వా(49*), చిగురుపాటి వెంకట(11*) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. వీకే వినీత్(24), అర్జున్ రాజ్‌పుత్(16), యశ్‌బర్దన్(9), అన్వయ్ ద్రవిడ్(19), ఆర్యన్(9), కావ్యా పటేల్(0) పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో రిజ్వానుల్లా 3, నికాబ్ 2, అలీ రజా, సయ్యాం, అబ్బాస్ తలొక వికెట్ చొప్పున పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

శాండ్‌పేపర్ వివాదం.. ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలను ఖండించిన వసీం అక్రమ్!

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: వైభవ్ సూర్యవంశీ టీమ్ ఓటమి

Updated Date - Nov 14 , 2026 | 07:06 PM