సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: వైభవ్ సూర్యవంశీ టీమ్ ఓటమి
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:29 PM
ప్రతిష్ఠాత్మక టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరించిన బిహార్ జట్టు ఓటమి పాలైంది. సౌరాష్ట్రపై 5 వికెట్ల తేడాతో పరాజయం చవి చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరించిన బిహార్ జట్టు ఓటమి పాలైంది. సౌరాష్ట్రపై 5 వికెట్ల తేడాతో పరాజయం చవి చూసింది. అత్యంత పిన్న వయసులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ బిహార్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే వైభవ్ టీమ్‌కు ఓటమి తప్పలేదు. ఇక బ్యాటర్‌గానూ వైభవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ జట్టుకు తొలి రెండు మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీని కెప్టెన్‌గా ఆ రాష్ట్ర బోర్డు నియమించింది. సౌరాష్ట్రతో తొలి మ్యాచ్‌లో ఈ యువ ప్లేయర్ 12 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బిహార్ జట్టు 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..
పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..