Share News

వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. 15 ఏళ్లకే కెప్టెన్‌ అయిన తొలి క్రికెటర్..

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:51 PM

భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీ20 క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. 15 ఏళ్లకే కెప్టెన్‌ అయిన తొలి క్రికెటర్..
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే టీ20 క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026-27లో భాగంగా శనివారం సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో బిహార్ జట్టుకు వైభవ్ నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు (Vaibhav Sooryavanshi World Record).


ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో బిహార్, సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా టాస్‌కు వచ్చాడు. ప్రస్తుతం అతడి వయసు 15 ఏళ్ల 232 రోజులు మాత్రమే. ఇప్పటివరకు చిన్న వయసులోనే కెప్టెన్ అయిన రికార్డు క్రొయేషియా జట్టుకు నాయకత్వం వహించిన వుకుసిక్ పేరు మీద ఉంది. వుక్‌సిక్ 17 ఏళ్ల 311 రోజుల వయసులో క్రొయేషియా జట్టుకు కెప్టెన్ అయ్యాడు. తాజాగా ఆ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలుగొట్టాడు. కెప్టెన్‌గా రికార్డు సృష్టించినప్పటికీ, తొలి మ్యాచ్‌లో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు (Youngest T20 Captain).


టాస్ గెలిచిన బిహార్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది (Bihar vs Saurashtra). ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో క్యాచ్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కాగా, ఈ టోర్నీలో బిహార్ తరఫున రెండు మ్యాచ్‌లు మాత్రమే వైభవ్ ఆడనున్నాడు. నవంబర్ 19 నుంచి ఖతార్‌లో ప్రారంభం కానున్న ఏసీసీ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భారత్ తరఫున ఆడేందుకు వైభవ్ వెళ్లనున్నాడు.


ఇవి కూడా చదవండి..

ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..


పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 14 , 2026 | 02:09 PM