రోహిత్.. ఆ సమస్యను ఇప్పుడే పరిష్కరించుకో: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:50 PM
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఔట్ అవుతున్న తీరును పరిశీలిస్తే ఆందోళన కలుగుతోందని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఔట్ అవుతున్న తీరును పరిశీలిస్తే ఆందోళన కలుగుతోందని అన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌నకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో రోహిత్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది రెండో డకౌట్. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 23 పరుగులే చేశాడు (Mohammad Kaif about Rohit Sharma).
ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రోహిత్ బ్యాటింగ్ గురించి విశ్లేషించాడు. 'తొలి ఓవర్‌లోనే రోహిత్ తరచూ వికెట్ కోల్పోతున్నాడు. క్రీజులో కాళ్లు కదపకుండా నిలబడటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఫుట్‌వర్క్ సరిగా లేదు. ముఖ్యంగా బంతి కొంత షార్ట్ లెంగ్త్‌లో పడినప్పుడు పూర్తిగా వెనక్కి వెళ్లలేక, ముందుకు కదలలేక మధ్యలోనే ఆగిపోతున్నాడు. ఈ తరహా బంతులకు రోహిత్ తన కెరీర్‌లో చాలాసార్లు వికెట్ సమర్పించుకున్నాడు. న్యూజిలాండ్ పిచ్‌లపై అదనపు బౌన్స్, స్వింగ్ ఉండటంతో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది' అని కైఫ్ పేర్కొన్నాడు (Rohit Sharma Dismissal).
'2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. అక్కడి పిచ్‌లపై బౌన్స్, సీమ్ కదలిక ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఎదురవుతున్న పరిస్థితులు ప్రపంచకప్‌లో కూడా ఉంటాయి. న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కూడా తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరారు. అయితే రోహిత్ బ్యాటింగ్‌లో కనిపిస్తున్న సమస్యను ప్రత్యేకంగా గుర్తించాలి. బంతి పిచ్‌పై పడిన తర్వాత దాని కదలికను అంచనా వేయడంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. ప్రపంచకప్‌నకు ముందే రోహిత్ ఆ సమస్యను పరిష్కరించుకోవాలి' అని కైఫ్ సూచించాడు.
ఇవి కూడా చదవండి..
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. చైనాలో ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ కీలక భేటీ..
పసిడి ధరలు మరింత కిందకు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..