గాయంతో పోరాడుతూ హాఫ్ సెంచరీ.. కోహ్లీ స్టైల్‌లో వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి సెలెబ్రేషన్!
ABN , Publish Date - Nov 14 , 2026 | 05:32 PM
అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో కోహ్లీ స్టైల్‌లో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ హైఓల్టేజ్ పోరులో టీమిండియా యువ ఓపెనర్, మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ అర్ధశతకం సాధించాడు. ముఖ్యంగా దెబ్బ తగిలినా వెనక్కి తగ్గకుండా బ్యాటింగ్ కొనసాగించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్థాన్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్యవీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన అతడు 61 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. ఐదో ఓవర్‌లో అలీ రజా బౌలింగ్‌లో ఆర్యవీర్ కుడి చేయి మోచేతికి బంతి బలంగా తగిలింది. నొప్పితో బాధపడుతున్నప్పటికీ నిలకడగా పరుగులు రాబట్టాడు. చివరకు అర్ధశతకం పూర్తి చేసిన అనంతరం తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీని గుర్తు చేసేలా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. విరాట్ ఐకానిక్ సెలెబ్రేషన్ ‘లెట్ మై బ్యాట్ డూ ది టాకింగ్(నా బ్యాటే మాట్లాడుతుంది) అన్నట్లుగా సంజ్ఞతో ఆర్యవీర్ చేసిన ఈ సెలెబ్రేషన్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ‘తండ్రి సెహ్వాగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూనే.. తన అభిమాన క్రికెటర్ కోహ్లీ అడుగుజాడల్లో నడుస్తున్నాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శాండ్‌పేపర్ వివాదం.. ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలను ఖండించిన వసీం అక్రమ్!
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: వైభవ్ సూర్యవంశీ టీమ్ ఓటమి