Share News

సముద్రపు ఒడ్డున సంగీత వెలుగులు

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:52 PM

సముద్రపు ఒడ్డును వీణల్లా వెలుగుతున్న ఈ విద్యుత్‌ స్తంభాలను చూశారా? అవి కేవలం అలంకరణ కోసం పెట్టినవి కాదు... విద్యుత్‌ను సృష్టిస్తాయి.

సముద్రపు ఒడ్డున సంగీత వెలుగులు
Musical Radiance

సముద్రపు ఒడ్డును వీణల్లా వెలుగుతున్న ఈ విద్యుత్‌ స్తంభాలను చూశారా? అవి కేవలం అలంకరణ కోసం పెట్టినవి కాదు... విద్యుత్‌ను సృష్టిస్తాయి. సముద్రపు గాలిని సంగీతంగా మారుస్తూ విద్యుత్తును ఉత్పత్తి చేసే విండ్‌ హార్ప్‌లను ఏర్పాటు చేసింది గ్రీస్‌ దేశం.

గ్రీస్‌ అంటే శిల్పకళారూపాలకు పెట్టింది పేరు. ఆ కళా రూపానికి కొంత సాంకేతికతను జోడిస్తున్నారు. సాయంత్ర సమయంలో సముద్ర తీరం వెంబడి అలా నడుస్తుంటే... మంద్రమైన సంగీతం చెవిన పడితే ఎలా ఉంటుంది?


ఆ ఊహే బాగుంది కదూ! దాన్ని నిజం చేసేలా గ్రీస్‌ దేశంలో... సముద్ర తీరం వెంబడి హార్ప్‌లను ఏర్పాటు చేశారు. పునరుత్పాదక శక్తి వనరులను ఇలా కళతో అనుసంధానించడాన్ని గ్రీస్‌ ఛాలెంజింగ్‌గా తీసుకుంది. అయితే సంగీతానికే ఈ హార్ప్‌లను పరిమితం చేయలేదు. ప్రతీ

చిన్న తీగలో పవన టర్బైన్‌లను కూడా అమర్చారు. ఈ టర్బైన్‌ల వల్ల రాత్రి కాగానే అక్కడి వీధి లైట్లు వెలుగుతాయి. అంతేకాదండోయ్‌...

ఇవి ఛార్జింగ్‌ పోర్ట్‌లుగా కూడా పనిచేస్తాయి. అంటే వాటితో చిన్న చిన్న యంత్ర పరికరాలను, ఫోన్‌లను ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు. ఐడియా భలేగుంది కదూ.


ఈ వార్తలు కూడా చదవండి:

త్వరలో ఆర్టీసీలో వెల్ఫేర్‌ కమిటీల రద్దు

స్వయంకృషితో ఎదిగిన మేధావి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 14 , 2026 | 01:52 PM