‘ప్రజా పాలన’లో 15 వినూత్న కార్యక్రమాలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:55 AM
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
చిన్నారులు, యువత, మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి
రహదారులపై ప్రమాదాల నివారణకు వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ ఏర్పాటు
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లా చంద్రాయణపల్లి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ‘వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్’ను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా పంచవటి విద్యాలయంలో చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్‌నెస్ పార్కును ప్రారంభించారు. పిల్లలు తమ సమస్యలను చెప్పుకొనేందుకు బాల్ పంచాయతీలను నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే గోల్డెన్ అవర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీపీఆర్ శిక్షణలో 48,227 మంది పాల్గొన్నారు. రైతు వారంలో భాగంగా టీజీ ఆర్గానిక్స్ యాప్‌ను ప్రారంభించారు. పలు జిల్లాల్లో మహిళల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. మహిళలు, పిల్లల పోషణలో తండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేలా 38,144 మంది తండ్రులతో ‘ఫాదర్ పార్టిసిపేషన్ క్యాంపెయిన్’ నిర్వహించారు. 19,367 మంది గర్భిణులకు అనీమియా పరీక్షలు నిర్వహించారు. బాలల భద్రత, మాదకద్రవ్యాల నిరోధంపై 600 మంది పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ్‌సలో విద్యార్థులకు 100 ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. సామాజిక కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ’ డ్రైవ్, 2కే వాక్‌థాన్, రన్‌లను నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.