Share News

అయ్‌బాబోయ్! ఆమె జడ ఎంత పొడుగో.. గిన్నిస్ రికార్డ్ దాసోహమాయె.!

ABN , Publish Date - Aug 08 , 2026 | 04:52 PM

జుట్టు పెంచుకోవాలన్న ఆమె పట్టుదల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8.10 అడుగుల పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు.

అయ్‌బాబోయ్! ఆమె జడ ఎంత పొడుగో.. గిన్నిస్ రికార్డ్ దాసోహమాయె.!
Uttarakhand woman grows long hair

ఇంటర్నెట్ డెస్క్: జుట్టు పెంచుకోవాలన్న ఆమె పట్టుదల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8.10 అడుగుల పొడవైన జుట్టుతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. ఆమె జడను చూస్తే.. ఎవరైనా వావ్.. అనాల్సిందే.!


ఉత్తరాఖండ్‌కు చెందిన రేణు ధారియాల్‌ అత్యంత పొడవైన కురులు కలిగిన మహిళగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్ దక్కించుకున్నారు. ఆమె జుట్టు పొడవు ఏకంగా 271.50 సెం.మీ.(8 అడుగుల 10 అంగుళాలు)గా నమోదైంది. 2026 ఏప్రిల్‌ 15న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఆమె జుట్టును కొలిచి ఈ రికార్డును ధ్రువీకరించారు గిన్నిస్ అధికారులు. తన పొడవాటి జుట్టు గురించి రేణు స్పందిస్తూ.. 2015 నుంచి తన జుట్టును కత్తిరించకుండా పెంచానని చెప్పుకొచ్చారు. సుమారు 11 ఏళ్ల పాటు చూపిన సహనం, శ్రద్ధే ఇప్పుడు తనను గిన్నిస్‌ విజేతగా నిలిపాయన్నారు. భారతీయ సంస్కృతిలో అందం, సంప్రదాయానికి ప్రతీకగా భావించే ఆలోచనే తనను ప్రభావితం చేసిందని ఆమె పేర్కొన్నారు.


కాగా.. రేణుకు ముందు ఈ రికార్డు ఉక్రెయిన్‌కు చెందిన అలియా నసీరోవా అనే మహిళ పేరిట ఉంది. ఆమె జుట్టు 257.33 సెం.మీ.(8 అడుగుల 5.3 అంగుళాలు) పొడవు ఉండగా.. 14 సెం.మీ. ఎక్కువగా పెంచి మునుపటి రికార్డును అధిగమించారు. దాదాపు పదేళ్లపాటు జట్టును కత్తిరించలేదన్న ఆమె.. తన దేశం, ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఫీట్ సాధించానన్నారు.


ఇవీ చదవండి:

కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా

'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా

Updated Date - Aug 08 , 2026 | 04:52 PM