Share News

కత్తులతో పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలు.. చివరకు ఏమైందంటే?

ABN , Publish Date - Jul 18 , 2026 | 09:02 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కత్తులతో స్కూలుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

కత్తులతో పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలు.. చివరకు ఏమైందంటే?

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ కౌశాంబీ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆ పాఠశాల హెడ్‌మాస్టర్ కత్తి, క్లీవర్‌(పెద్ద కత్తి)తో స్కూలుకు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం.. ఈ సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి.


ప్రధానోపాధ్యాయురాలైన శిఖా సింగ్‌.. పాఠశాల ఆవరణలో కత్తి, క్లీవర్‌తో తిరుగుతున్నట్టు స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(బీఈవో) వెంటనే ఆ స్కూలుకు చేరుకుని సదరు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. ఆ తర్వాత హెచ్ఎమ్‌ను ప్రశ్నించగా.. 'నాకు భద్రత లేదనే భయంతోనే వాటిని వెంట తీసుకొస్తున్నాను' అని ఆమె బదులిచ్చారు. అయితే.. తనకు ఎవరితో ముప్పు ఉందనే విషయాన్ని మాత్రం ఆమె బయటకు చెప్పలేదు. ఈ విషయమై శిఖా సింగ్ భర్తతోనూ పోలీసులు మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం.. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చని ఆయన సమాధానం చెప్పినట్టు సమాచారం.


ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన స్థానిక జిల్లా విద్యాధికారి.. శిఖా సింగ్‌పై చట్టపరమైన చర్యలకు ఆదేశించారు. వెంటనే సదరు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సహా సస్పెన్షన్ దిశగా చర్యలు చేపట్టారు. విద్యాసంస్థల్లో భయాందోళనలు సృష్టించే ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని, తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

21వ రోజుకు దీక్ష.. వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

పెట్టుబడులకు అనుకూలతలో రాష్ట్రానికి 10వ ర్యాంకు

Updated Date - Jul 18 , 2026 | 09:02 AM