Share News

వింత హెయిర్ మ్యూజియం.. 16 వేల మంది మహిళల జుట్టు భద్రం

ABN , Publish Date - Nov 08 , 2026 | 10:00 AM

ఇప్పటిదాకా వివిధ రకాల మ్యూజియాలను చూసి ఉంటారు. మరి... హెయిర్‌ మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ మ్యూజియంలో కొన్నివేల మంది మహిళల జుట్టు భద్రపరిచి ఉందంటే ఆశ్చర్యమేస్తుంది.

వింత హెయిర్ మ్యూజియం.. 16 వేల మంది మహిళల జుట్టు భద్రం
Hair Museum Turkey

ఇప్పటిదాకా వివిధ రకాల మ్యూజియాలను చూసి ఉంటారు. మరి... హెయిర్‌ మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ మ్యూజియంలో కొన్నివేల మంది మహిళల జుట్టు భద్రపరిచి ఉందంటే ఆశ్చర్యమేస్తుంది. టర్కీలో ఉన్న ఈ వింత మ్యూజియాన్ని చూసేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తుంటారు.

ఒక కళాకారుడు సరదాగా చేసిన ఒక పని ప్రపంచంలోనే ఒక వింతైన మ్యూజి యం ఏర్పడేలా చేసింది. టర్కీలో కప్పడోసియా రీజియన్‌లోని అవానోస్‌ పట్టణంలో... గాలిప్‌ కొరుక్కూ అనే కుమ్మరి కళాకారుడున్నాడు. అతని నైపుణ్యానికి అందరూ ఫిదా అయ్యేవారు. కుండల తయారీ కళను నేర్చుకునేందుకు పర్యాటకులు అతని వర్క్‌షాపును సంద ర్శించేవారు. 1979లో ఓ ఫ్రెంచ్‌ పర్యాటకు రాలు అతని వర్క్‌షాపును సందర్శించింది.


అక్కడే మూడు నెలల పాటు ఉండి కుండల తయారీ కళ నేర్చుకుంది. గాలిప్‌ ఆమె జుట్టు అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమె తిరిగి వెళ్లే సమయంలో జ్ఞాపకంగా ఆమెను అడిగి మరీ కొంత జుట్టు కత్తిరించి తీసుకున్నాడు. ఆ జుట్టును పేపర్‌పై అతికించి, ఆమె పేరు, ఫోన్‌ నంబర్‌ రాసి వర్క్‌షాప్‌లో పెట్టాడు. కాలక్రమంలో గాలిప్‌ వర్క్‌షాప్‌నకు వచ్చిన అనేకమంది మహిళా పర్యాటకులు వారి జుట్టును చిన్నగా కత్తిరించి, అక్కడ వదిలివెళ్లడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో 16 వేల మంది మహిళల జుట్టు ఉంది. దాంతో వర్క్‌షాప్‌ కాస్తా... హెయిర్‌ మ్యూజియంగా గుర్తింపు పొందింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోనూ చోటు సంపాదించుకుంది.


book5.jpgలక్కీడిప్‌తో విహారయాత్ర

మహిళలు ఈ కుమ్మరి కళను నేర్చుకుని, దానిపై ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో గాలిప్‌ ఏటా లక్కీడిప్‌ నిర్వహించి... విజేతలకు ఉచిత విహారయాత్రను అందిస్తున్నారు. ప్రతీ ఏడాది జుట్టు వదిలివెళ్లిన మహిళల పేర్లలో నుంచి లక్కీ డ్రా ద్వారా 10 మందిని ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కప్పడోసియాలో వారం రోజుల పాటు ఉచితంగా పర్యటించే అవకాశం కల్పిస్తారు. అంతేకాకుండా గాలిప్‌ దగ్గర కుండల తయారీ కళను నేర్చుకునే అవకాశాన్ని కూడా అందిస్తారు.


book5.3.jpgనేటికీ మహిళలు ఈ మ్యూజియంలో జ్ఞాపకంగా తమ జుట్టును వదిలివెళుతుం టారు. ఈ మ్యూజియంలో ఫొటోలు తీయడానికి అనుమతి లేదు. ఎందుకంటే అక్కడ ప్రదర్శనకు ఉంచిన జుట్టు పక్కనే మహిళల ఫోన్‌ నంబరు, చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుంది. వారి గోప్యతను కాపాడటానికే ఫొటోగ్రఫీపై నిషేధం విధించినట్లు గాలిప్‌ చెబుతారు. ఈ వింత మ్యూజియాన్ని సందర్శించాలనుకునే మహిళా పర్యాటకుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

భ్రాంతిలో బతికితే ఫలితమిదే!

స్థిరంగా పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 10:00 AM