Share News

సింగపూర్‌లో కొత్త స్కీమ్.. పుస్తకాలు చదివితే డబ్బులిస్తారు!

ABN , Publish Date - Sep 17 , 2026 | 09:42 AM

పుస్తకాలను జ్ఞానం కోసమో, కాలక్షేపం కోసమో చదువుతుంటారు. ఈ రెండే కాకుండా ఇకపై పుస్తకాలు చదివితే ఆ దేశంలో డబ్బులు కూడా వస్తాయి.

సింగపూర్‌లో కొత్త స్కీమ్.. పుస్తకాలు చదివితే డబ్బులిస్తారు!
books

ఇంటర్నెట్ డెస్క్: కేవలం పుస్తకాలు చదివి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే మీరు అర్జెంటుగా సింగపూర్ వెళ్లాలి మరి. తాజాగా ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘రీడ్ఎస్‌జీ’ పేరుతో నేషనల్ రీడింగ్ మంత్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా రోజుకు కనీసం 15 నిమిషాలు పుస్తకాలు చదివితే 20 వర్చువల్ పాయింట్లు వస్తాయి. ఇలాంటివి1,000 పాయింట్లు కలిపితే ఒక సింగపూర్ డాలర్ అవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గోనేవారు ‘క్రౌడ్‌టాక్’ అనే ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌లో 15 నిమిషాలు చదివిన సమయాన్ని రోజూ నమోదు చేయాలి.


ఎందుకీ కార్యక్రమం

ప్రస్తుత సాంకేతిక యుగంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరి స్క్రీన్ టైమ్ ఎక్కువగా నమోదవుతోంది. మరోవైపు ప్రజలు పుస్తకాలు చదవడం క్రమంగా మరిచిపోతున్నారు. దీంతో స్క్రీన్ టైమ్‌ను తగ్గించడానికి, రీడర్స్ సంఖ్యను పెంచడానికి సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది. 2024లో నేషనల్ లైబ్రరీ బోర్డు నిర్వహించిన అధ్యయనంలో ఆ దేశంలో పుస్తకాలు చదివే వారి సంఖ్య 28 శాతమే ఉందని తేలింది.

పఠనంతో పాటు ప్రజాసేవ

ఈ కార్యక్రమంలో నమోదైన రీడింగ్ టైమ్ ద్వారా స్వచ్ఛంద సంస్థలకు నిధులు సమకూరనున్నాయి. 75 లక్షల నిమిషాల పఠన సమయం నమోదైతే పలు సామాజిక కార్యక్రమాలకు 1.5 లక్షల సింగపూర్ డాలర్లను నిధుల కింద ప్రభుత్వం ఇస్తుంది. కాగా ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రయోగదశలో ఉంది.


ఇవీ చదవండి

విధులకు హాజరుకాకుండానే నెలకు రూ.70 వేల జీతం.. కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలికి నోటీసు

9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్‌ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు

Updated Date - Sep 17 , 2026 | 09:44 AM