Share News

హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రీ పోస్టింగ్‌లు

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:37 AM

రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పునర్నియామాల కోసం దాదాపు 2 నెలలుగా ఎదురుచూస్తున్న రిటైర్డ్‌ ఉన్నతాధికారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రీ పోస్టింగ్‌లు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్‌ ఉద్యోగు ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జూలై 2న ఉత్తర్వులు జారీ చేసింది.

హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రీ పోస్టింగ్‌లు

  • 14 మంది రిటైర్డ్‌ ఉన్నతాధికారులు తిరిగి విధుల్లోకి

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పునర్నియామాల కోసం దాదాపు 2 నెలలుగా ఎదురుచూస్తున్న రిటైర్డ్‌ ఉన్నతాధికారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రీ పోస్టింగ్‌లు ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్‌ ఉద్యోగు ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జూలై 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్యాడర్ల వారు కలిపి 300 మందికి పైగా రిటైర్డ్‌ ఉద్యోగులు, అధికారులు రీ పోస్టింగ్‌కు అర్హత పొందారు. వీరిలో చాలామందికి గత నెలలో రీ పోస్టింగ్‌ ఆర్డర్లు ఇచ్చేశారు. 14 మందికి ప్రభుత్వ అనుమతితో రీ పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సెక్రటరీ హెప్సిబారాణి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రిటైరైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి రావడం, ప్రస్తుతం ఉన్న చీఫ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల పోస్టుల్లో ఖాళీల కంటే ఎక్కువ మంది తిరిగి విధుల్లో చేరేందుకు రావడంతో ఐదుగురి హోదాలు తగ్గిం చి పోస్టులను సర్దుబాటు చేశారు. సీఈ క్యాడర్‌లో ఉన్న వేణుగోపాలరావుకు ఎస్‌ఈగా రివర్షన్‌ ఇచ్చారు.

అలాగే డి.రమాకాంతరావు, కె.శంకరప్ప, జీవీ విశ్వేశ్వరరావు, బి.బుజ్జిబాబులను ఈఈ క్యాడర్‌ నుంచి డీఈఈలు రివర్షన్‌ ఇచ్చారు. ఇక రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో కీలకమైన చీఫ్‌ ఇంజనీర్‌గా టి.పద్మనాభంను నియమించారు. రీ పోస్టింగ్‌లకు అర్హత సాధించినవారిలో పద్మనాభం సీనియర్‌. ఇక నలుగురు ఎస్‌ఈలలో ఎస్‌.వేణుగోపాలరావును హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా నియమించి, జనరల్‌ మేనేజరు(పరిపాలన, విజిలెన్స్‌)గా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇక రివర్షన్‌ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల ను హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టరు కార్యాలయం లో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 05:37 AM