శివభక్తుల వాహనాన్ని ఢీకొన్న సీఐ కారు
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:16 AM
కర్నూలు జిల్లాలో ఓ ఎక్సైజ్ సీఐ కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ శివభక్తుల వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి గోనెగండ్ల మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది.
మద్యం మత్తే కారణం?
కర్నూలు జిల్లాలో ఘటన
గోనెగండ్ల, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఓ ఎక్సైజ్ సీఐ కారుతో బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ శివభక్తుల వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి గోనెగండ్ల మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మిగనూరు ఎక్సైజ్ సీఐ రమేశ్ రెడ్డి ప్రయాణిస్తున్న కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయన క్షేమంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలను ఆరాతీశారు. కర్ణాటక రాష్ట్రం సింధనూరుకు చెందిన కొందరు శివభక్తులు తుఫాన్ వాహనంలో శ్రీశైలానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి ప్రయాణమయ్యారు. ఇదే రహదారిపై రమేష్ రెడ్డి మద్యం తాగి వాహనాన్ని వేగంగా నడిపారు. గోనెగండ్ల మండల శివారు ప్రాంతానికి రాగానే భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని తన వాహనంతో వేగంగా ఢీకొట్టారు. మద్యం తాగి వాహనం నడిపినట్టు భక్తులు చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. ఈ ప్రమాదంలో సీఐ కారు ధ్వంసమైంది. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఆయనను పోలీసులు విచారించి పంపించేశారు. గోనెగండ్ల సీఐ చంద్రబా బు మాట్లాడుతూ రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గా యాలు కాలేదని, ప్రమాదానికి గల కారణాల ను విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య