Share News

వినాయక చవితి సంబరాల్లో అదరగొట్టిన అంబానీ కోడలు.. ‘ఏకదంతాయ’ పాటకు డ్యాన్స్

ABN , Publish Date - Sep 15 , 2026 | 01:02 PM

వినాయక చవితి సందర్భంగా అంబానీ ఇంట్లో సంబరాలు జరిగాయి. ‘ఏకదంతాయ’ పాటకు రాధిక మర్చంట్ డ్యాన్స్ చేశారు.

వినాయక చవితి సంబరాల్లో అదరగొట్టిన అంబానీ కోడలు.. ‘ఏకదంతాయ’ పాటకు డ్యాన్స్
Radhika Merchant dance

ఇంటర్నెట్ డెస్క్: ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘ఏకదంతాయ వక్రతుండాయ’ అంటూ అంబానీ కోడలు రాధిక మర్చంట్ నృత్యం చేశారు. ఆమె డ్యాన్స్ చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆమె నర్తించిందని ప్రశంసిస్తున్నారు.


రాధిక డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఐఫా షేర్ చేసింది.‘ హర్ట్‌ఫెల్ట్ ట్రిబ్యూట్ టు లార్డ్ గణేశా’ అని కాప్షన్ కూడా పెట్టింది. ఆ వీడియోలో రాధిక నృత్యంతో పాటు ఆమె ముఖ కవళికలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వీడియోలో రాధికతో పాటు మరో నలుగురు మహిళలు నర్తించారు.

రాధిక మర్చంట్ 2024లో ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీని వివాహమడారు. తనకు డ్యాన్స్‌పై ఇష్టముందని గతంలోనే చెప్పిన ఆమె.. వినాయక చవితి రోజున చక్కటి నృత్యాన్ని ప్రదర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో అద్భుతం.. 3.8 లక్షల వజ్రాలతో కొలువుదీరిన గణపయ్య

కుక్కపిల్లతో ఆప్యాయంగా ఆడుతున్న బాలిక.. నెటిజన్ల ఫిదా

Updated Date - Sep 15 , 2026 | 01:33 PM