రోడ్డుపై నిమ్మకాయలు, టెంకాయ.. ఈ పోలీస్ ఏం చేశారో మీరే చూడండి..
ABN , Publish Date - Apr 02 , 2026 | 08:38 PM
రోడ్లపై కొన్ని కూడళ్ల వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, టెంకాయలు కనిపిస్తుంటాయి. వాటిని చూడగానే పాదచారులు, వాహనదారులు భయంతో దూరంగా వెళ్లిపోతుంటారు. అయితే దీనిపై ఓ పోలీస్ అధికారి వినూత్నంగా అవగాహన కల్పించారు..
రోడ్లపై కొన్ని కూడళ్ల వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, టెంకాయలు కనిపిస్తుంటాయి. వాటిని చూడగానే పాదచారులు, వాహనదారులు భయంతో దూరంగా వెళ్లిపోతుంటారు. నిమ్మకాయలను తొక్కడం గానీ, వాహనాలతో తొక్కించే సాహసం గానీ చేయరు. ఇలాంటివి కనిపిస్తే వాహనాలను సైతం రోడ్డు కిందకు దించి మరీ వెళ్లడం చూస్తుంటాం. అయితే దీనిపై ఓ పోలీస్ అధికారి వినూత్నంగా అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదురు పోలీస్ అధికారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై నిమ్మకాయలు, టెంకాయ, పసుపు, కుంకుమ కనిపిస్తే ప్రజలు భయపడడం సర్వసాధారణం. వాటిని తొక్కకుండా దూరంగా వెళ్లిపోతుంటారు. వాహనదారులు కూడా వాటిని తొక్కే సాహసం చేయరు. అయితే దీనిపై ఓ పోలీస్ అధికారి వినూత్నంగా అవగాహన కల్పించారు. రోడ్డుపై పెట్టిన టెంకాయను అక్కడే పగులగొట్టి, అందులోని కొబ్బరిని కూడా తిన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వాటి పట్ల భయం వద్దని చెప్పారు.
ఇలాంటి మూఢనమ్మకాలను ఎవరూ నమ్మొద్దని పోలీస్ అధికారి సూచించారు. నిమ్మకాయలు రోడ్లపై కనిపిస్తే జ్యూస్ చేసుకుని తాగాలని సూచించారు. అలాగే కొబ్బరి వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఈ పోలీస్ అధికారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ పోలీస్ చేసిన పనికి హ్యాట్సాప్’.. అంటూ కొందరు, ‘మీరు గ్రేట్ సార్’.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.