ఎగరలేని పక్షి కోసం...
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:51 PM
‘కొత్తగా రెక్కలొచ్చెనా... గూటిలోని గువ్వ పిల్లకి...’ అన్నట్లుగా చేశాడు మార్క్ జోసెఫ్ కోల్నడో. ఫిలిప్పీన్స్‌లో ఒక చిలుక మీద పిల్లి దాడి చేసింది. దాంతో చిలుక ఎగురలేని స్థితికి చేరుకుంది.
‘కొత్తగా రెక్కలొచ్చెనా... గూటిలోని గువ్వ పిల్లకి...’ అన్నట్లుగా చేశాడు మార్క్ జోసెఫ్ కోల్నడో. ఫిలిప్పీన్స్‌లో ఒక చిలుక మీద పిల్లి దాడి చేసింది. దాంతో చిలుక ఎగురలేని స్థితికి చేరుకుంది. ఆ చిలుకకుకొత్తగా ఎగిరే ఉపాయం చేసి, ఆ వీడియోని నెట్టింట పంచుకున్నాడు జోసెఫ్. దాన్ని చూసి అంతా ‘ఔరా’ అంటున్నారు.
ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే పక్షి ఒక రెక్కను కోల్పోతే..? దాని ఆశలు గల్లంతే కదా. అలా అని ఆ చిలుకను వదిలేయలేదు దాని యజమాని జోసెఫ్. చిన్న క్యాబిన్ తయారుచేసి, దానికి కస్టమ్ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశాడు.
ఆ క్యాబిన్‌ని డ్రోన్‌కి అటాచ్ చేసి, చిలుకను ఆకాశంలోకి పంపించాడు. దాంతో చిలుక ఆనందానికి హద్దుల్లేవు. అలా గాల్లోకి వెళ్లగానే రెక్కల్ని ఆడించే ప్రయత్నం చేసింది. అయితే ఒక రెక్క లేదు కదా... అయినా సరే, రెక్క తెగిన పక్షి నింగి నుంచి నేలను చూసింది. యజమానికి పెంపుడు పక్షి మీద ఉన్న ప్రేమను... చాలా గొప్పగా తెలియజేశాడంటూ అతన్ని అభినందిస్తున్నారు. ఆ పక్షి సంతోషాన్ని చూసి మురిసిపోతున్నారు. ఇదో అరుదైన, అద్భుతమైన దృశ్యమనే చెప్పాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్మశానం... ఓ పర్యాటక ప్రాంతం...
ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి
Read Latest AP News And Telangana News And International News And Telugu News