ముంబైలో ఘోర ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన బీఎండబ్ల్యూ, ముగ్గురి మృతి
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:40 AM
ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బ్లాక్ బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి కిందపడింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని కోస్టల్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బ్లాక్ బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి కిందపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని నాయర్ ఆసుపత్రిలోని ట్రామా వార్డులో చికిత్సకు తరలించారు (Mumbai BMW crash).
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బీఎండబ్ల్యూ కారు మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు కోస్టల్ రోడ్డుపై ప్రయాణిస్తోంది. లొటస్ జెట్టీ సమీపంలో కారు అదుపు తప్పి బ్రిడ్జి సరిహద్దు గోడను ఢీకొట్టింది. అనంతరం బ్రిడ్జిపై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం ఆదివారం ఉదయం సుమారు 5:20 గంటలకు జరిగినట్లు కోస్టల్ రోడ్ కంట్రోల్ రూమ్ తెలిపింది. కారులో ఉన్న నలుగురినీ నాయర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు (Mumbai Coastal Road accident).
ప్రమాద తీవ్రతకు కారు దెబ్బతిన్న తీరు అద్దం పడుతోంది. బ్రిడ్జిపై ఉన్న సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో అది కూడా దెబ్బతింది (BMW accident Mumbai). బీఎండబ్ల్యూ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. విండ్‌షీల్డ్ పగిలిపోయింది, పైకప్పు లోపలికి వంగిపోయింది. బంపర్ ఊడిపోవడంతో కారు అంతర్గత భాగాలు బయటకు కనిపించే స్థాయిలో వాహనం దెబ్బతింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఇవి కూడా చదవండి..
రియాద్ విమానాశ్రయం సమీపంలో మంటలు.. సౌదీలో కీలక ప్రాంతాలపై హౌతీల దాడులు..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..