చర్లపల్లి-శ్రీకాకుళం మార్గంలో 16 దసరా స్పెషల్ రైళ్లు
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:51 AM
దసరా పండుగను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-శ్రీకాకుళం మార్గంలో 16 ప్రత్యేక రైళ్లను నడపనుంది.
చర్లపల్లి-నాగర్‌కోయిల్ మార్గంలో మరో 10 రైళ్లు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): దసరా పండుగను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి-శ్రీకాకుళం మార్గంలో 16 ప్రత్యేక రైళ్లను నడపనుంది. 07037 రైలు చర్లపల్లి నుంచి అక్టోబరు 6, 13, 20, 27, నవంబరు 3, 10, 17, 24 తేదీల్లో, 07038 రైలు శ్రీకాకుళం నుంచి అక్టోబరు 7, 14, 21, 28, నవంబరు 4, 11,18, 25 తేదీల్లో బయలుదేరతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
ఈ రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో హాల్ట్ ఉంటుందన్నారు. చర్లపల్లి-నాగర్‌కోయిల్ మార్గంలోనూ 10 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. 07535 రైలు ఈ నెల 25 నుంచి అక్టోబరు 23 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి, 07536 రైలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 25వరకు ప్రతి ఆదివారం నాగర్‌కో యిల్ నుంచి బయలుదేరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
వికసిత్ భారత్‌లో తెలంగాణ కీలకం
అదనపు కట్నం వేధింపులకు నవవధువు బలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News