Share News

గొర్రెలకో రక్షణ కవచం

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:17 AM

మేతకు వెళ్లిన గొర్రెలపై తోడేళ్లు అకస్మాత్తుగా దాడిచేసి చంపేశాయి. పొరుగు దేశమైన జర్మనీలో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు ఆస్ట్రియాలో నివసించే రుడాల్ఫ్‌ను తీవ్రంగా కలచివేశాయి.

గొర్రెలకో రక్షణ కవచం
sheep protection

మేతకు వెళ్లిన గొర్రెలపై తోడేళ్లు అకస్మాత్తుగా దాడిచేసి చంపేశాయి. పొరుగు దేశమైన జర్మనీలో జరుగుతున్న ఈ వరుస సంఘటనలు ఆస్ట్రియాలో నివసించే రుడాల్ఫ్‌ను తీవ్రంగా కలచివేశాయి. తోడేళ్ల దాడుల వల్ల గొర్రెలను కోల్పోయి, రైతులు నష్టపోతుండటంతో... పరిష్కారం కోసం ఆలోచించాడు. మూడేళ్లపాటు శ్రమించి. ఒక రక్షణ కవచాన్ని తయారుచేశాడు. యుద్ధంలో యోధులు ధరించే ఇనుప రక్షణ జాలీ లాంటి ఈ కవచం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గొర్రెల కాపరులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, తోడేలు మాటు వేసి గొర్రెలపై దాడి చేసి చంపేసేది. రోజురోజుకు తోడేళ్ల బెడద పెరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఇదే సమయంలో ఆస్ట్రియాలో నివసించే రుడాల్ఫ్‌... పొరుగుదేశమైన జర్మనీలో జరుగుతున్న తోడేళ్ల దాడుల గురించిన కథనాలను పత్రికల్లో చదివేవాడు. ఆ వార్తలు ఆయనను కదిలించేవి.


book6.2.jpgరైతుల కోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. మూడేళ్ల పాటు శ్రమించి ఒక కవచాన్ని తయారుచేశారు. తోడేలు గొర్రెపై దాడి చేసి కరవాలని ప్రయత్నించినపుడు కవచం వల్ల కుదరదు. ఈ కవచాన్ని గొర్రెకు వేస్తే... వాటికి ఇతరత్రా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విశేషం. ఇనుప జాలీ వాడితే బరువు ఎక్కువ ఉండి గొర్రె మోయలేకపోతుంది. అందుకే తేలికైన ప్లాస్టిక్‌ వలను ఎంచుకున్నారు రుడాల్ఫ్‌. ఆ వలపై పదునైన ముళ్లు ఏర్పాటు చేశారు. తోడేలు కరవాలని చూస్తే ఆ ముళ్లు గుచ్చుకుంటాయి. దాంతో రెండోసారి దాడి చేసేందుకు తోడేలు వెనకాడు తుందనేది రుడాల్ఫ్‌ అభిప్రాయం. ‘‘తోడేలు చాలా తెలివైన జంతువు. ఒకసారి నొప్పి కలిగితే అది గొర్రెను మళ్లీ కరిచేందుకు ప్రయత్నించదు’’ అంటారు రుడాల్ఫ్‌.


book6.3.jpgసందేహాలున్నా...

మొదట్లో రుడాల్ఫ్‌ ఆవిష్కరణకు రైతులు, ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. చాలామంది దీనిని ఖరీదైనదిగా, వాస్తవ పరిస్థితుల్లో పెద్దగా ఉపయోగపడేది కాదని విమర్శించారు. ‘‘గొర్రెల ఉన్ని ఈ వలలో చిక్కు కుపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా తోడేళ్లు వ్యూహాన్ని మార్చుకుని కాళ్లు, తల వంటి రక్షణ లేని భాగాలపై దాడి చేసే ప్రమాదం ఉంది’’ అని స్థానిక రైతు క్రూగర్‌ అభిప్రాయపడ్డారు. వందల సంఖ్యలో గొర్రెలకు ఇలాంటి కవచాలు తయారు చేయడం, వాటికి తొడగడం చాలా ఖరీదైన వ్యవహారమని మరి కొంతమంది అన్నారు.


అయితే రుడాల్ఫ్‌ మాత్రం ఆ విమర్శ లను పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు తోడేలు దాడిలో ఈ కవచం ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షించలేదు. అయితే ఒక గొర్రెకు ఈ రక్షణ వలను తొడిగినప్పుడు, అది ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవడం, మేత మేయడం చేసిందని రుడాల్ఫ్‌ అంటున్నారు. ఏది ఏమైనా వలతో ఉన్న గొర్రెల ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. చాలామంది సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణగా ప్రశంసించారు. ఒకవిధంగా ఈ ప్రయత్నం పశువులను రక్షించేందుకు పరిష్కారాలను ఎలా కనుగొనాలనే దానిపై సరికొత్త ఆలోచనలకు దారితీసిందని చెప్పవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి

కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 11:48 AM