Share News

పాదచారుడితో గొడవపడ్డ భారత సంతతి మహిళ.. చివరకు అరెస్ట్

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:20 PM

కెనడాలో నడిరోడ్డుపై ఒక పాదచారుడితో గొడవపెట్టుకున్న భారత సంతతికి చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

పాదచారుడితో గొడవపడ్డ భారత సంతతి మహిళ.. చివరకు అరెస్ట్
Indian-origin woman

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో నడిరోడ్డుపై ఒక పాదచారుడితో గొడవపెట్టుకున్న భారత సంతతికి చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కెనడాలోని ఒక వీధిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ఓ కారు అతడి మీదకు దూసుకొచ్చి.. దాదాపుగా ఢీకొట్టబోయింది. దీంతో ఆ పాదచారుడు మొబైల్ తీసి అంతా రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. కారులోంచి దిగిన ఓ మహిళ అతడి దగ్గరకు వచ్చింది. ‘నన్ను వీడియో తీసే అధికారం నీకు ఎవరిచ్చారు..?’ అంటూ ప్రశ్నించింది. వీడియో రికార్డ్ చేయడాన్ని తప్పుబట్టింది. ఆపై పాదచారుడితో గొడవపెట్టుకుని, అతడిని రోడ్డు పక్కకు లాగడానికి ప్రయత్నించింది.


కారు డ్రైవ్ చేస్తున్న మహిళ భర్త అప్పుడే వీరి దగ్గరకు వచ్చి పాదచారుడికి క్షమాపణ చెప్పాడు. దానికి ‘మీ భార్య నాతో అనవసరంగా గొడవ పెట్టుకుంది. నేను పోలీసులను పిలుస్తాను’ అని పాదచారుడు సమాధానమిచ్చాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసు వాహనంలో కూర్చోపెట్టారు. అలాగే మహిళ భర్తని కూడా అరెస్ట్ చేయాలని, అతడు ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నాడని పాదచారుడు ఆరోపించాడు.


ఇవీ చదవండి

పిల్లల కోసం కారుకు ఎదురెళ్లిన ఎలుగు... చివరకు ఏమైందంటే..

బారికేడ్‌ను ఇలాక్కూడా వాడతారని ఇప్పుడే తెలిసింది.. వీళ్ల నిర్వాకం చూస్తే..

Updated Date - Oct 07 , 2026 | 04:25 PM