Share News

పిల్లల కోసం కారుకు ఎదురెళ్లిన ఎలుగు... చివరకు ఏమైందంటే..

ABN , Publish Date - Oct 06 , 2026 | 10:19 AM

రోడ్డుపై వెళ్తున్న కారుకు ఒక్కసారిగా తల్లి ఎలుగుబంటి, దాని పిల్ల అడ్డుగా వచ్చాయి. వాటికి దారి ఇచ్చేందుకు డ్రైవర్ కారును ఆపినా.. క్షణాల్లోనే పరిస్థితి మారిపోయింది.

పిల్లల కోసం కారుకు ఎదురెళ్లిన ఎలుగు... చివరకు ఏమైందంటే..
Bear Attack on Car

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లోని హొక్కైడోలో ఓ కారు డ్రైవర్‌కు ఊహించని భయానక అనుభవం ఎదురైంది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో తల్లి ఎలుగుబంటి, దాని పిల్ల ఒక్కసారిగా కారు ముందు ప్రత్యక్షమయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కారును ఆపి వాటికి దారి ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఎలుగుబంటి పిల్లలు కారు నుంచి దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పినట్లే అనిపించింది. అంతలోనే పెద్ద ఎలుగుబంటి హఠాత్తుగా వెనక్కి తిరిగి కారు వైపు వేగంగా వచ్చింది. క్షణాల్లో కారు ఇంజిన్‌పైకి ఎక్కి దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన డాష్‌క్యామ్ వీడియోను జపాన్ పోలీసులు విడుదల చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఎలుగుబంటి దాడిలో కారు ముందు భాగం దెబ్బతింది. హుడ్‌పై పెద్ద పెద్ద గీతలు పడటంతో పాటు కొంత భాగం దెబ్బతింది. అయితే.. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తన పిల్ల సమీపంలో ఉండటంతో తల్లి ఎలుగుబంటి కారును ముప్పుగా భావించి దూకుడుగా ప్రవర్తించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలుగుబంట్లు సంచరించే హొక్కైడో ప్రాంతాల్లో ప్రజలు.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘పిల్లలంటే ఏ తల్లికైనా ప్రాణమే’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ‘పిల్లల కోసం ఏ తల్లి అయినా పోరాటం చేస్తుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 11:26 AM