Share News

జనసేనలో చేరికలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులందరికీ అవకాశం: నాగబాబు

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:46 AM

విజయవాడలో జనసేన పార్టీలోకి పలువురు వైసీపీ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు చేరారు. జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి స్వాగతం పలికారు.

జనసేనలో చేరికలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులందరికీ అవకాశం: నాగబాబు
Nagababu

విజయవాడ, అక్టోబర్ 7: నగరంలో జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ, సీపీఎం పార్టీలకు చెందిన వారు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి నాగబాబు చేతుల మీదుగా ఆటోలు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అమ్మిశెట్టి వాసును నాగబాబు అభినందించారు. రోజుకు కనీసం ఒక్కరికైనా ఉపయోగపడే మంచి పని చేయాలన్నది తమ విధానమని తెలిపారు.


పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని.. కొంత సంయమనం పాటించాలని నాగబాబు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హత ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. కార్యకర్తలను పవన్ కల్యాణ్ ఎప్పుడూ వదలరని, కార్యకర్తలు, వీర మహిళలపై ఆయనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. ప్రభుత్వం బలంగా నిలబడటంలో పవన్ కల్యాణ్ కృషి, ధైర్యం, మద్దతు ఎంతో ఉందని పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదని, పవన్ కల్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ముఖ్యమని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ ఏ పని అప్పగించినా చేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 01:48 PM