Share News

జిమ్‌లో నీళ్లు.. ఆగని వర్కవుట్లు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:02 PM

భారీ వర్షాలు పడి.. మోకాల్లోతు నీళ్లు చేరితే స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది. అలాగే సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లలోకి వర్షపు నీరు చేరితే.. వాటిని మూసేస్తారు.

జిమ్‌లో నీళ్లు.. ఆగని వర్కవుట్లు.. వీడియో వైరల్
Gym In Floods

ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాలు పడి.. మోకాల్లోతు నీళ్లు చేరితే స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది. అలాగే సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లలోకి వర్షపు నీరు చేరితే.. వాటిని మూసేస్తారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, జిమ్‌ వంటి వాటిలో నీరు చేరితే దాదాపుగా ఇలాగే చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూడడానికి చాలా ఫన్నీగా ఉందా వీడియో.


ఆ వైరల్ వీడియోలో.. పెద్ద హాల్‌‌లో జిమ్ ఏర్పాటు చేశారు. అందులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీటిలోనే పలువురు యువకులు జిమ్ చేస్తున్నారు. మరికొందరు అటు ఇటు తిరుగుతున్నారు. వారంతా ఆ నీటి ఏ మాత్రం లెక్క చేయకుండా.. తమ పని తాము చేసుకు పోతున్నారు. కొందరు డంబెల్స్ ఎత్తుతుంటే.. మరికొందరు మెషీన్లపై వర్కవుట్ చేస్తున్నారు. ఇంకొందరు బైసెప్స్ కర్ల్స్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జిమ్‌లో అన్ని వైపులా నీరు నిలిచి ఉంది.


ట్రేడ్ మిల్, వ్యాయామ యంత్రాలతోపాటు ఇతర పరికరాలు అన్ని నీటిలోనే మునిగి ఉన్నాయి. అయితే కుంభవృష్ఠిగా కురిసిన వర్షాలకు జిమ్‌లోకి భారీగా నీరు వచ్చి చేరినట్లుగా ఉంది. ఆ నీటి మట్టం కూడా కనిష్ట స్థాయికి చేరిన తర్వాతే జిమ్‌లో కసరత్తులు చేపట్టినట్లుగా ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది. ఈ వీడియో ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు.


ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తు్న్నారు. ఈ వీడియో చూస్తుంటే.. వీరికి ఫిట్‌నెస్ అత్యంత ముఖ్యమైన విషయం అని స్పష్టమవుతుందని.. ఇది వారి పట్టుదలకు నిదర్శనం అని పేర్కొన్నారు. కొంత మంది దీనిని ఫిట్‌నెస్ ట్రెండ్‌గా అభివర్ణించారు. నీటిలో జిమ్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వీడియో మాత్రం ఫన్నీగా ఉందని మరికొందరు పేర్కొన్నారు. ఈ వీడియోను @Truecircle7 అనే యూజర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు.. వీడియో వైరల్

టీ స్టాల్‌లో షాకింగ్ దృశ్యం.. వీడియో వైరల్!

For More Viral News And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 05:10 PM