Share News

ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 12 , 2026 | 04:01 PM

బైక్‌పై ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు ఎక్కారు. ఆ వీడియో వైరల్ అవుతుంది.

ట్రాఫిక్ రూల్స్‌కు తూట్లు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు నిత్యం సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదాలు నివారించడం కోసం ఎన్నో చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తు్న్నారు. కానీ వాహనదారులు ఇవేమీ పట్టించుకోకుండా.. బైక్‌లపై ఫీట్లు మీద ఫీట్లు చేస్తున్నారు. ఓ బైక్‌పై ఒకరు ఇద్దరూ కాదు.. ఏకంగా ఏడుగురు ఎక్కారు. అదీ కూడా ఐదుగురు బైక్‌పై ఎక్కితే.. వారి మీద మరో ఇద్దరు ఎక్కారు. ఓ వీడియో వైరల్ అవుతుంది. బైక్‌ నడుపుతున్న వ్యక్తితోపాటు మిగిలిన వారు కూడా టీనేజర్లులానే ఉన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.


ఇది ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్దం అని అంటున్నారు. బైక్‌ను చెన్నై ఎక్స్‌ప్రెస్ అని కొందరు పిలుస్తుంటే.. మరికొందరు బిహార్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తున్నారు. అది స్ప్లెండర్ పవర్ అని ఇంకొందరు అభివర్ణిస్తున్నారు. ఈ వీడియోను avyaa ___0011 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగింది.. వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదా మాత్రం తెలియ లేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీ స్టాల్‌లో షాకింగ్ దృశ్యం.. వీడియో వైరల్!

చీని తోటలో పేకాట.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారుగా..

For More Viral News And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 05:17 PM