చీని తోటలో పేకాట.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారుగా..
ABN , Publish Date - Jul 10 , 2026 | 07:07 PM
సంఘ విద్రోహ శక్తుల ఆగడాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. డ్రోన్ల పహారాలో అక్రమ గంజాయి సాగు, పేకటారాయుళ్ల ఆగడాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు.
కడప, జులై 10: సంఘ విద్రోహ శక్తుల ఆగడాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. డ్రోన్ల పహారాలో అక్రమ గంజాయి సాగు, పేకటారాయుళ్ల ఆగడాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. నిర్మానుష్య ప్రాంతాలతోపాటు తోటలు, అడవుల్లో కూడా డ్రోన్లు పహారా కాస్తున్నాయి. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతోంది. అలాంటి సంఘటన ఒకటి వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలం కత్తూలురులో చోటు చేసుకుంది. ఓ చీని తోటలో పేకాట ఆడుతూ అడ్డంగా పోలీసులకు దొరికిపోయారు జూదరులు .
ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8,990 నగదు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే.. డ్రోన్ పహారా విషయాన్ని ముందుగానే గుర్తించిన జూదరులు.. పోలీసులు వస్తున్నట్లు గమనించారు. దీంతో పేక ముక్కలు, నగదు అక్కడే వదిలేసి.. తలో దిక్కుకు పరుగెత్తారు. పోలీసులు వెంబడించిన పట్టుకున్నారు. అనంతరం వారిని వేంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదంతా డ్రోన్ కెమెరాల్లో రికార్డ్ అయింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గేట్ కీపర్ సాహసానికి నెటిజన్ల సెల్యూట్.. షాకింగ్ ఘటన!
ఏనుగు పాదమే మెట్టైంది.. చిన్నారి సాహసం వీడియో వైరల్
For More Viral News And Telugu News