Share News

ఏనుగు పాదమే మెట్టైంది.. చిన్నారి సాహసం వీడియో వైరల్

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:48 PM

సోషల్ మీడియాలో వివిధ రకాలైన వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి. మరికొన్ని చూసిన కొద్ది చూడాలనిపించేలా ఉంటాయి.

ఏనుగు పాదమే మెట్టైంది.. చిన్నారి సాహసం వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వివిధ రకాలైన వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని మనస్సుకు హత్తుకునేలా ఉంటాయి. మరికొన్ని చూసిన కొద్ది చూడాలనిపించేలా ఉంటాయి. అలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏనుగుపైకి చిన్నారి ఎక్కింది. ముద్దుగా ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది. జంతువులు ఒక్కసారి మచ్చిక అయితే.. అవి మనషులతో స్నేహంగా ముసలుతాయి. వారిపై ప్రేమాభిమానులు కురిపిస్తాయి అని స్పష్టం చేసేలా ఈ వీడియో ఉంది. ఏనుగుపైకి ఎక్కేందుకు దాని పాదం వద్దకు చిన్నారి వెళ్లేంది. పాదం మీకు వెళ్లగానే.. దానిని పైకి ఎత్తింది. మెడకు కట్టిన ఎర్రనీ తాడు పట్టుకుని ఆ పాప అలవోకగా ఏనుగుపైకి దాదాపుగా ఎక్కేసింది.


ఇంకా పైకి ఎక్కేందుకు ప్రయత్నస్తుంటే ఆ చిన్నారి వల్ల కావడం లేదు. దీంతో ఆ పక్కనే ఉన్న మావటీ.. పాప పాదాన్ని పట్టుకుని ఏనుగుపైకి ఎక్కించాడు. దీంతో ఏనుగుపైకి సులువుగా ఎక్కేసింది. అయితే ఏనుగు ఎక్కే ముందు తన చెప్పులను కిందే వదిలేసింది. కాళ్లకు పెట్టుకున్న పట్టాలను కూడా ఆ పక్కనే పెట్టేసింది. పైకి ఎక్కే సమయంలో ఏనుగుకు పట్టాలు వల్ల గాయాలు అవుతాయని భావించి వాటిని అక్కడే వదిలేసినట్లుగా ఉంది. ఇది ఆ ఏనుగు పట్ల ఆ చిన్నారికి ఉన్న ప్రేమ, వాత్సల్యాన్ని తెలియజేస్తుంది. కానీ జంతువులకు ప్రజలు సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ముఖ్యంగా ఏనుగులకు కోపం వస్తే బీభత్సం సృష్టిస్తాయి.


కొన్ని సార్లు ఆ భావన తప్పు అని ఇటువంటి వీడియోలు చూస్తే స్పష్టమవుతోంది. చిన్నారి, ఏనుగు మధ్య ఉన్న స్నేహాన్ని ఈ వీడియో వివరిస్తుంది. పాప ఎక్కడంతో.. ఏనుగు కూడా తన తలతోపాటు తొండాన్ని ఊపింది. దీంతో ఆ చిన్నారి ఆనందం వ్యక్తం చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. శిక్షణ పొందిన ఏనుగులు మావటి మాట వింటాయని వారు పేర్కొంటున్నారు. అందువల్ల అవి.. ప్రజలకు హాని చేయవని స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియోను ’elephant_kingdom987’ అనే యూజర్ పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై పూర్తి సమాచారం లేదు.


ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!

మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్

For More Viral News And Telugu News

Updated Date - Jul 10 , 2026 | 05:50 PM