Share News

టీ స్టాల్‌లో షాకింగ్ దృశ్యం.. వీడియో వైరల్!

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:45 PM

దేశంలో టీ ఓ పానీయం మాత్రమే కాదు.. చాలా మందికి దైనందిన జీవితంలో ఓ భాగం. ఉదయం నుంచి రాత్రి వరకు పలుమార్లు టీ తాగుతారు. అందుకే రైల్వేస్టేషన్, బస్టాండ్‌లతోపాటు దాదాపు ప్రతి వీధిలో టీ స్టాల్స్ ఉంటాయి.

టీ స్టాల్‌లో షాకింగ్ దృశ్యం.. వీడియో వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో టీ ఓ పానీయం మాత్రమే కాదు.. చాలామందికి దైనందిన జీవితంలో ఓ భాగం. ఉదయం నుంచి రాత్రి వరకు పలుమార్లు టీ తాగుతారు. అందుకే రైల్వేస్టేషన్, బస్టాండ్‌లతోపాటు దాదాపు ప్రతి వీధిలో టీ స్టాల్స్ ఉంటాయి. అయితే టీ విక్రయించే వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. మెదట చూడగానే అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ పళ్లెంలోని పంచదార మీద పెద్ద సంఖ్యలో జోరీగలు వాలి ఉన్నాయి. వాటిని అతడు ఏ మాత్రం పట్టించుకోకుండా ఓ చెంచాతో పంచదారను టీ గ్లాసులో వేశాడు.


ఆ తర్వాత అందులో వేడి టీ పొసి.. చెంచాతో కలిపి పక్కన పెడతాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇదంతా బహిరంగంగానే జరుగుతుంది. చుట్టుపక్కల చాలా మంది ఈ తతంగాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నప్పటీ.. వారంతా అదేమీ పట్టించుకోకుండా టీ తాగేస్తున్నారు. ఈ వీడియోను @Murti_Nani అనే యూజర్ ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఆహార, పానీయాలను తయారు చేసేటప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ఇలా తయారు చేస్తే.. ప్రజల ఆరోగ్యానికి చేటు అని చెబుతున్నారు. ఇక్కడి టీ రుచి చక్కెరలా కాకుండా జోరీగల్లా ఉందని నెటిజన్లు వ్యాఖ్యాస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చీని తోటలో పేకాట.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారుగా..

గేట్ కీపర్ సాహసానికి నెటిజన్ల సెల్యూట్.. షాకింగ్ ఘటన!

For More Viral News And Telugu News

Updated Date - Jul 12 , 2026 | 03:28 PM