Viral Video: ఈ వృద్ధ దంపతుల ఆనంద క్షణాలు మాటల్లో వర్ణించలేము.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:37 PM
జీవితంలో ఇకచూడలేం అన్న దాన్ని కళ్లారా చూస్తే వారు పొందే ఆనందం మాటల్లో వర్ణించలేం. జీవిత కాలం మొత్తం సముద్రం గురించి వినడమే తప్ప చూడని వృద్ధ దంపతుల కోరిక తీరిన వేళ.. వారు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తమ జీవితాంతం సముద్రాన్ని చూడని ఓ వృద్ధ జంటను మనవరాలు మొదటిసారిగా సముద్ర తీరానికి తీసుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హృదయాలను హత్తుకునే ఈ అద్భుతమైన దృశ్యం మహారాష్ట్ర (Maharashtra)లోని సింధూదుర్గ్ జిల్లా(Sindhudurg district)లో ఉన్న కుంకేశ్వర్ (Kunkeshwar Beach)లో జరిగినట్లు తెలుస్తోంది. దివ్య తావ్డే (@shortgirlthingss) తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో తన అమ్మమ్మ, తాతయ్యల చిరకాల కోరికను తీర్చడానికి ఇద్దరినీ సముద్రం వద్దకు తీసుకెళ్లింది. సముద్రపు అలలు పాదాలపై తాకుతూ వెళుతుంటే.. వృద్ధ దంపతులు ఏదో తెలియని అనుభూతి పొందారు.
ఆ నీటిని తాకి నమస్కరించి, మురిసిపోతున్న వారి కళ్లల్లోని ఆనందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ జంట మహారాష్ట్ర సంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. ‘సముద్రం గురించి వారు జీవితాంతం వినడమే తప్ప ఏనాడూ చూడలేదు. మొదటిసారి వారిద్దరూ నీటిని తాకి నమస్కరించడం చూస్తుంటే స్వచ్ఛమైన విశ్వాసం, భక్తి, ఆనందం ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థమవుతోంది’ అంటూ మనవరాలు దివ్య తావ్డే తన పోస్ట్ లో పేర్కొంది. ముసలితనంలో వృద్ద దంపతులకు తోడుగా ఉండి, వారి చిన్నచిన్న కోరికలను తీర్చుతున్న మనవరాలిని నెటిజన్లు అభినందిస్తున్నారు. వివిధ రకాల కామెంట్లు, ఎమోజీలతో మెచ్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ ప్రచార వాహనాన్ని సీజ్ చేసిన సీబీఐ
చరిత్రపై దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి.. అజిత్ డోభాల్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి