రాజధాని రోడ్లపై దూసుకుపోతున్న మహిళ.. ఇలా కూడా కారు నడుపుతారా?
ABN , Publish Date - Jun 29 , 2026 | 08:10 AM
ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమదైన శైలిలో ఆయా రంగాల్లో వారు దూసుకుపోతున్నారు. అంతరిక్ష రంగంలోకి మేము సైతం.. అంటూ ఇలా వెళ్లి.. అలా వచ్చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తమదైన శైలిలో ఆయా రంగాల్లో వారు దూసుకుపోతున్నారు. అంతరిక్ష రంగంలోకి మేము సైతం.. అంటూ ఇలా వెళ్లి.. అలా వచ్చేస్తున్నారు. బైకులు, కారులు, బస్సులు, భారీ వాహనాలనే కాకుండా.. అత్యంత వేగంగా నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా వారు నడుపుతున్నారు. అయితే ఒక మహిళ చీర కట్టుకుని.. చెంగుతో తలను కప్పుకుని ఓ విలాసవంతమైన స్పోర్ట్స్ కారును చాలా సులువుగా నడుపుతోంది.
చాలా ఆత్మవిశ్వాసంతో ఆమె ఈ కారు నడుపుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కారు నడిపే తీరు.. వాహనంపై నియంత్రణతోపాటు ఓ ప్రొఫెషనల్ డ్రైవర్‌లాగా ఆమె డ్రైవింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె పేరు నిక్కీ దహియా. ఢిల్లీకి చెందిన ఆమె.. కంటెంట్ క్రియేటర్‌గా విధులు నిర్వహిస్తోంది.
ఈ స్పోర్ట్స్ కారు నడుపుతున్న నిక్కీ దహియా వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకరు అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తే.. మరోకరు పురుషాధిక్య రంగంలో ఇది మహిళల విజయంగా అభివర్ణించారు. ఇంకోకరు.. ఆమె చీర ధరించి.. తలను కొంగుతో కప్పుకుందన్నారు. సాంప్రదాయ పద్దతులను నేటికి నిక్కీ దహియా పాటిస్తోందని అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్విమ్మింగ్ పూల్‌లోకి డైవ్ చేసిన యువకుడు.. క్షణాల్లోనే..
బంధాలకు భాష అవసరం లేదు.. కోడలు-ముత్తవ్వ ముచ్చటైన సంభాషణ.. వీడియో వైరల్
Read Latest Viral News And Telugu News