ఈ బస్సు క్లీనర్ నిజంగా దేవుడే.. వృద్ధుడిని ఎలా కాపాడాడో చూడండి..
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:42 PM
ఆపదలో ఉన్న సమయంలో కొందరు సడన్‌గా ప్రత్యక్షమై.. ప్రమాదం నుంచి తప్పిస్తుంటారు. సమయానికి దేవుడిలా వచ్చాడు.. అని ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తుంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది..
ఆపదలో ఉన్న సమయంలో సడన్‌గా కొందరు ప్రత్యక్షమై.. ప్రమాదం నుంచి తప్పిస్తుంటారు. సమయానికి దేవుడిలా వచ్చాడు.. అని ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బస్సు నుంచి పడిపోతున్న వృద్ధుడిని క్లీనర్ ఎంతో చాకచక్యంగా రక్షించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. క్లీనర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళంలో (Kerala) చోటు చేసుకుంది. కుట్టియట్టూరు–కన్నూర్ మార్గంలో నడుస్తున్న బస్సులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో బస్సు ఆగగానే ఓ వృద్ధుడు పైకి ఎక్కాడు. అయితే వృద్ధుడు లోపలికి రాగానే బస్సు కదలడంతో ఆతను బ్యాలెన్స్ కోల్పోయాడు. ఈ క్రమంలో కిందపడిపోబోయాడు.
అయితే అక్కడే ఉన్న బస్సు క్లీనర్ వెంటనే వెంటనే అప్రమత్తమయ్యాడు. కిందపడుతున్న వృద్ధుడిని (Cleaner saves old man) వెంటనే పట్టుకుని పైకి లేపాడు. అంతలో అక్కడున్న మరో ప్రయాణికుడు కూడా అప్రమత్తమై.. వృద్ధుడి కాలు పట్టుకుని కిందపడకుండా ఆపాడు. ఆ సమయంలో క్లీనర్ క్షణం ఆలస్యం చేసినా.. ఆ వృద్ధుడు బస్సు నుంచి కిందపడిపోయేవాడు. సమయానికి స్పందించి వృద్ధుడిని కాపాడడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ క్లీనర్ దేవుడి రూపంలో సాయం చేశాడుగా’.. అంటూ కొందరు, ‘బస్సు ఎక్కే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1200కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
సినిమా సీన్‌ను తలదన్నే చోరీ.. 30 సెకన్లలో 105 కిలోల చికెన్‌ను..
కొడుకు కోసం చేతిపై కీబోర్డ్ ట్యాటూ వేయించుకున్న తల్లి.. కారణం ఏంటంటే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..