రాఖీ కట్టేసిన ఫ్లైట్ అటెండెంట్లు.. యువకుడి గగ్గోలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:47 PM
నేడు దేశవ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడికి విమానంలో ఎదురైన అనుభవం ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నేడు దేశవ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడికి విమానంలో ఎదురైన అనుభవం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే, అతడికి పక్కనే ఉన్న మరో వ్యక్తి రాఖీ నుంచి ఎలా తప్పించుకున్నాడో చూసి జనాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. సుధాంశూ కౌశిక్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశాడు.
ఎయిర్ ఇండియా విమానంలో వెళుతుండగా ఆ వ్యక్తికి ఫ్లైట్ అటెండెంట్లు రాఖీ కట్టారు. మొదట ఒక ఫ్లైట్ అటెండెంట్ రాఖీ కడుతుంటే మరో అటెండెంట్ రికార్డు చేసింది. వాళ్లు రాఖీ కట్టడాన్ని ఆ ప్యాసింజర్ కూడా ఎంజాయ్ చేశాడు. ఫ్లైట్ అటెండెంట్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అయితే, నెట్టింట షేర్ చేసిన వీడియోపై మాత్రం సరదా కామెంట్స్ చేశాడు. ‘ఫ్లైట్ అటెండెంట్లు అందరూ నాకు రాఖీ కట్టేశారు. సోదరుడిని చేసేసుకున్నారు. ఇలాగైతే ఎలా?’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు.
ఈ వీడియోకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది కడుపుబ్బా నవ్వారు. ఫ్లైట్‌లో రాఖీ పండుగ అద్భుతమని అన్నారు. అయితే, ఫ్లైట్‌లో ఇంత జరుగుతున్నా కూడా ఆ పక్క సీటులోని వ్యక్తి మాత్రం హ్యాపీగా నిద్రపోవడాన్ని కొందరు గమనించారు. రాఖీ ముప్పును తప్పించుకునేందుకు అతడు నిద్ర నటించాడని సరదా కామెంట్స్ చేశారు. రాఖీ కట్టిన అటెండెంట్లకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? అని మరికొందరు వీడియో షేర్ చేసిన ప్యాసింజర్‌ను అడిగారు. అలాంటిదేమీ లేదని అతడు బదులిచ్చాడు. ఆ సమయంలో తన వద్ద క్యాష్ లేదా స్వీట్స్ లేవని పేర్కొన్నాడు. ఇంటికొచ్చాక ఈ విషయం చెబితే తన తల్లి కోప్పడిందని కూడా చెప్పాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఈ వార్లనూ చదవండి:
వర్షంలో కుక్క బారి నుంచి చెల్లికి రక్షణగా అన్న.. వీడియో వైరల్
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..