Share News

వర్షంలో కుక్క బారి నుంచి చెల్లికి రక్షణగా అన్న.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 28 , 2026 | 06:43 PM

తనకు రక్షణగా నిలుస్తాడని సోదరుడి చేతికి సోదరి.. రక్షాబంధన్ రోజున రాఖీ కడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను అనేకం చూస్తుంటాం. అయితే.. ఓ బాలుడు వర్షంలో తడుస్తూ.. బురదలో నడుస్తూ.. చిట్టి చెల్లికి రక్షణగా నిలిచాడు. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. నిజమైన రాఖీ కానుక అంటే ఇదే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు...

వర్షంలో కుక్క బారి నుంచి చెల్లికి రక్షణగా అన్న..  వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: తనకు రక్షణగా నిలుస్తాడని సోదరుడి చేతికి సోదరి.. రక్షాబంధన్ రోజున రాఖీ కడుతుంది. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చూస్తుంటాం. అయితే.. ఓ బాలుడు వర్షంలో తడుస్తూ.. బురదలో నడుస్తూ.. చిట్టి చెల్లికి రక్షణగా నిలిచాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ బాలుడు తన చిట్టి చెల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ పాపకు పెద్ద దుప్పటి లాంటి వస్త్రంతో కప్పి, జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు.


మరో వైపు జోరుగా వర్షం పడుతోంది. ఇంతలో ఓ కుక్క ఆ పాప వద్దకు వచ్చింది. ఆ బాలుడు ఆ పాపను జాగ్రత్తగా పట్టుకుని.. కుక్కను పక్కకు తరిమేశాడు. ఆ కుక్కను పాప వద్దకు రాకుండా చేశాడు. అదే సమయంలో వర్షంలో ఆమె తడవకుండా.. దుప్పటి కింద పడకుండా జాగ్రత్త కూడా తీసుకున్నాడు.


ఈ వీడియోను ఘర్ కే కలేష్ ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రక్షాబంధన్ సమయంలో ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించిందని అంటున్నారు. తన సోదరిని రక్షించాలనే ఆ బాలుడు ఇలా చేశాడని చెబుతున్నారు. ఇది నిజమైన రక్షాబంధన్ కానుక అని వారు అభివర్ణిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..

రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్

For More Prathyekam News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 07:00 PM