Share News

కొడుకు కోసం చేతిపై కీబోర్డ్ ట్యాటూ వేయించుకున్న తల్లి.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:48 PM

ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడితో కమ్యూనికేట్ అవ్వటం కోసం ఓ మహిళ తన చేతిపై కీబోర్డ్ ట్యాటూ వేయించుకుంది. కుమారుడి ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకుని, అతడితో కమ్యూనికేట్ అవ్వటం కోసం ఎలక్ట్రానిక్ పరికరాలతో అవసరం లేని శాశ్వత పరిష్కారాన్ని కనుగొంది.

కొడుకు కోసం చేతిపై కీబోర్డ్ ట్యాటూ వేయించుకున్న తల్లి.. కారణం ఏంటంటే..
Canadian mother

ఇంటర్‌నెట్ డెస్క్: ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడితో కమ్యూనికేట్ అవ్వటం కోసం ఓ మహిళ తన చేతిపై కీబోర్డ్ ట్యాటూ వేయించుకుంది. కుమారుడి ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకుని, అతడితో కమ్యూనికేట్ అవ్వటం కోసం ఎలక్ట్రానిక్ పరికరాలతో అవసరం లేని శాశ్వత పరిష్కారాన్ని కనుగొంది. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జెస్సికా ఫ్లెచర్ అనే మహిళ కుమారుడు.. 11 ఏళ్ల హంటర్ ఆటిజంతో బాధపడుతున్నాడు. కుమారుడితో కమ్యూనికేట్ అవ్వటం కోసం ఆమె అగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్‌నేటివ్ కమ్యూనికేషన్ ట్యాబ్లెట్ ఉపయోగిస్తోంది.


ఆ ట్యాబ్‌ను ఉపయోగించి కొన్ని రకాల సింబల్స్, పదాలతో హంటర్ తల్లితో కమ్యూనికేట్ అవుతుంటాడు. కొద్దిరోజుల క్రితం తల్లీకొడుకులు హోటల్‌కు డిన్నర్ చేయడానికి వెళ్లారు. డిన్నర్ చేస్తున్న సమయంలో ఆ ట్యాబ్ బ్యాటరీ సడెన్‌గా అయిపోయింది. కుమారుడితో కమ్యూనికేట్ అవ్వటం జెస్సికాకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అప్పుడే ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. ట్యాబ్‌కు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా ట్యాటూ షాపునకు వెళ్లింది. తన చేతిపై ఓ ప్రత్యేకమైన కీబోర్డును ట్యాటూ వేయించుకుంది.


ఆ కీబోర్డ్ ట్యాటూలో కొన్ని రకాల అక్షరాలతో పాటు కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి. హంటర్ తన తల్లితో కమ్యూనికేట్ అవ్వాలని అనుకున్నపుడు చేతిపై ఉన్న కీబోర్డ్ ట్యాటూను ఉపయోగిస్తున్నాడు. తల్లీకొడుకులు ఎంతో చక్కగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వడానికి ట్యాటూ ఓ మంచి సాధనంలా మారింది. జెస్సికా ట్యాటూకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జెస్సికా చేసిన అద్భుతమైన పనిపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

సింక్ డ్రెయిన్ తరచూ బ్లాక్ అవుతోందా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

నాతో బౌలింగ్ చేయించడం ఇషాన్ భయ్యా రిస్క్ అనుకున్నాడు.. కానీ!: వైభవ్ సూర్యవంశీ

Updated Date - Aug 29 , 2026 | 05:00 PM