నాతో బౌలింగ్ చేయించడం ఇషాన్ భయ్యా రిస్క్ అనుకున్నాడు.. కానీ!: వైభవ్ సూర్యవంశీ
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:39 PM
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న సూర్యవంశీ.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంతితోనూ అదరగొట్టాడు. మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న వైభవ్.. కెప్టెన్ ఇషాన్ కిషన్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది అతడి విధ్వంసకర బ్యాటింగ్. అయితే ఈ 15 ఏళ్ల కుర్రాడిలో మరో టాలెంట్ కూడా ఉంది. అదే బౌలింగ్. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న సూర్యవంశీ.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంతితోనూ అదరగొట్టాడు. మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న వైభవ్.. కెప్టెన్ ఇషాన్ కిషన్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు.
‘బ్యాటర్లను అడిగితే.. వాళ్లందరికీ బౌలింగ్ చేయడం ఇష్టమే. బ్యాటర్ బౌలింగ్ చేయడం.. బౌలర్ బ్యాటింగ్ చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ప్రత్యర్థి జట్టు వికెట్లు పడకపోవడంతో నాకు రెండు, మూడు ఓవర్లు బౌలింగ్ ఇచ్చారు. ఇషాన్ భయ్యా నాకు బంతి ఇవ్వడం రిస్క్ అనుకున్నాడు. కానీ.. నేను వికెట్ టేకర్‌నని అతడికి తెలియదు. నా మనసులో ఒకటే అనుకున్నా. ఐదు వికెట్లు తీసినా నాకు మూడు ఓవర్లే దొరుకుతాయి. అందుకే ఒకే చోట బంతిని కచ్చితంగా వేయాలని ప్రయత్నించా. నా స్పెల్‌ను వీలైనంత బాగా ముగించాలనుకున్నా. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ సరిగా సాగలేదు. అందుకే బంతితో జట్టుకు సహకరించడం చాలా ఆనందంగా అనిపించింది. ఒక బ్యాటర్ వికెట్ తీస్తే వచ్చే ఆనందానికి మించినది మరొకటి ఉండదు’ అని వైభవ్ వెల్లడించాడు. చెప్పాడు.
ఇవి కూడా చదవండి:
చీలమండ గాయం.. ఆసియా క్రీడలకు నీరజ్ చోప్రా దూరం
ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్