Share News

నీరు చుట్టుముట్టినా.. పిల్ల కోసం తల్లి కుక్క పోరాటం.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:19 PM

చుట్టూ ఎటు చూసినా పొంగిపొర్లే వదర నీరు. ప్రాణాలు కాపాడుకోవడమే కష్టమైన పరిస్థితి. అయినా తన గురించి ఆలోచించలేదు ఆ తల్లి కుక్క. తన చిన్నారిని నోటితో పట్టుకుని సురక్షితమైన కారు పైకప్పుపైకి చేర్చింది. ప్రాణం పోయినా పర్లేదు.. నా బిడ్డకు ఏమీ కాకూడదని తల్లి చేస్తున్న పోరాటం.. చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది.

నీరు చుట్టుముట్టినా.. పిల్ల కోసం తల్లి కుక్క పోరాటం.. వీడియో వైరల్
Mother Dog Saves Puppy

ఇంటర్నెట్ డెస్క్: చుట్టూ వరద నీరు వేగంగా ప్రవహిస్తున్న సమయంలో ఓ తల్లి కుక్క తన పిల్లను కాపాడేందుకు చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చుట్టూ నీరు నిండిపోవడంతో సురక్షితమైన ప్రదేశం కోసం వెతికిన తల్లి కుక్క, తన పిల్లను వెంట తీసుకుని కారు పైకప్పుపైకి చేరుకుంది. భౌ భౌ అని అరుస్తూ కాపాడమని దీనంగా మొరగడం అందరి హృదయాలనూ కలచి వేస్తోంది.


తమ పిల్లలపై జంతువులకు ఉన్న ప్రేమకు నిదర్శనంగా అనేక సంఘటనలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో వరదలో తన పిల్ల కోసం తల్లి కుక్క పడిన ఆరాటాన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. తల్లి ప్రేమకు కులం, మతం, జాతి అనే తేడా ఉండదని.. బిడ్డను కాపాడే విషయంలో ప్రతి తల్లీ ఒకేలా స్పందిస్తుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. వరదలో కుక్క ఘటనలో చివరకు ఏమైందో తెలీదు గానీ.. పరిస్థితి చూస్తుంటే దాన్ని స్థానికులు కాపాడి ఉండొచ్చని తలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 29 , 2026 | 03:48 PM