అమెరికాలో టీ అమ్ముతూ రోజుకు రూ.31,000 సంపాదన.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:53 AM
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో టీ, పోహా అమ్ముతూ రోజుకు సుమారు రూ.30,000 వేల నుంచి రూ.31,000 వేల వరకు సంపాదిస్తున్నాడో భారతీయుడు. ఈయన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ ప్రసాద్ అమెరికా(America)లో కార్పొరేట్ ఉద్యోగం చేసేవాడు. 2025 ఫిబ్రవరిలో జరిగిన లేఆఫ్స్(Layoffs) వల్ల తాను ఉద్యోగం కోల్పోయాడు. దీంతో నిరాశ చెందకుండా, లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ పరిసరాల్లో బిహారీ చాయ్‌వాలా(Bihari Chaiguy) పేరిట ఓ టీస్టాల్ ప్రారంభించాడు. పొడవైన జుట్టు, గడ్డం, భుజంపై వేసుకునే బిహారీ గుర్బా(టవల్)తో అక్కడి వారిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాకర్ ప్రసాద్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయమై ప్రభాకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో ఉండటం అంటే కేవలం పార్టీలు, విలాసవంతమైన జీవితం అనుకుంటారు. కానీ, ఇక్కడ డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. నేను ఉద్యోగం కోల్పోయిన తర్వాత చాలా బాధపడ్డాను. అప్పుడే నాకు టీ, పోహా అమ్మాలన్న ఆలోచన వచ్చింది. ఉన్న డబ్బుతో టీస్టాల్ పెట్టాను. ఇక్కడ అన్ని రోజులు బిజినెస్ నడవదు. నాకు ప్రతిరోజూ రూ.30,000 నుంచి రూ.31,000 వేల వరకు వస్తాయి. కష్టపడి పనిచేసి ఇంటికి డబ్బు పంపడమే నా లక్ష్యం’ అని అన్నాడు. ప్రస్తుతం ప్రభాకర్ టీ అమ్మే దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..