బాత్ రూమ్‌లో ఏడడుగుల మొసలి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Jul 31 , 2026 | 03:40 PM
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఓ ఇంటి బాత్ రూమ్‌లో ఏడడుగుల మొసలి కనిపించి కుటుంబాన్ని భయాందోళనకు గురిచేసింది. అప్రమత్తమైన యజమాని వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఓ ఇంటి బాత్ రూమ్‌లోఏడడుగుల మొసలి కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బాలాభాయ్ చౌహాన్ కుటుంబం అర్ధరాత్రి ఊహించని ఘటనను ఎదుర్కొంది. ఇంటి బయట కుక్కలు మొరగడంతో నిద్రలేచిన యజమాని బయటకు వచ్చారు. బాత్ రూమ్‌లో ఏదో అలికిడి రావడంతో వెళ్లి చూడగా ఉలిక్కిపడ్డారు. అక్కడ ఏడు అడుగుల భారీ మొసలి కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, దయా ఫౌండేషన్ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటపాటు జాగ్రత్తగా రెస్క్యూ నిర్వహించారు. మొసలికి ఎలాంటి గాయాలు కాకుండా, స్థానికులకు ప్రమాదం తలెత్తకుండా దానిని సురక్షితంగా పట్టుకుని సమీపంలోని చెరువులో విడిచిపెట్టారు. వర్షాకాలంలో వరదల కారణంగా మొసళ్లు నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తూ, ఇలాంటి సందర్భాల్లో ప్రజలు జంతువులకు దగ్గరగా వెళ్లకుండా వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఆరుబయట బాత్ రూమ్ తలుపులు తెరిచి ఉంచితే పాములు, ఇతర జంతువులు వచ్చి చేరుతాయి.. తస్మాత్ జాగ్రత్త’ అని ఒకరు, ‘వర్షాకాలంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత’ అని మరో నెటిజ్ కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి
19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు
Read Latest AP News And Telugu News