Share News

19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:19 PM

ఏపీలోని యూనివర్సిటీల పాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు
AP government

అమరావతి, జులై 31: ఏపీలోని యూనివర్సిటీల పాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన నామినేటెడ్ సభ్యులను తొలగించింది. ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల గవర్నింగ్ బాడీల రద్దుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్లాజ్-2 కింద నియమితులైన పాలక మండలి సభ్యులపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పదవీ రీత్యా కొనసాగుతున్న సభ్యులకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.


క్లాజ్-1 కింద ఉన్న ఎక్స్‌-ఆఫిషియో సభ్యులు యథావిధిగా కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)కు కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 02:13 PM