చంద్రబాబు దార్శనికత వల్లే ఏలేరు ఆయకట్టుకు సాగునీరు: మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:54 PM
ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమే వరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గోదావరి వరద జులైలోనే 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందని.. ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
కాకినాడ, జులై 31: ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమే వరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈరోజు(శుక్రవారం) పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పరివాహక ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోదావరి వరద జులైలోనే 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందని.. ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులంతా విధిగా పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు. అనుమతుల కోసం వేచి చూడకుండా ఏలేరు, పిఠాపురం కాలువల్లో తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాలువల ప్రక్షాళనకు నిధుల కొరత లేదని.. అవసరమైతే కేబినెట్‌లో ర్యాటిఫికేషన్ చేస్తామని మంత్రి వివరించారు. ఏలేరు రిజర్వాయర్‌లో ఉన్నది 8 టీఎంసీలే అని.. అందులో 6 టీఎంసీలు డెడ్ స్టోరేజ్‌లో ఉందన్నారు. పోలవరం ఎడమ కాలువ ఆఫ్-టేక్ ద్వారా ఏలేరుకు ప్రత్యామ్నాయంగా నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు దార్శనికత వల్లే ఎల్‌నినో పరిస్థితుల్లోనూ ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. గొడ్డలి పార్టీ నాయకుడికి, విజనరీ నేతకు తేడా గమనించాలని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి
Read Latest AP News And Telugu News