నడి రోడ్డుపై బైక్‌తో స్టంట్.. పల్టీ కొట్టిన రైడర్! వీడియో వైరల్
ABN , Publish Date - Jul 30 , 2026 | 04:00 PM
రహదారిపై ప్రయాణం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఎలా వెళ్తున్నామో కాదు.. ఎదురు వచ్చే వారు ఏటు వైపు నుంచి వస్తున్నారో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వాహనం ఢీ కొడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: రహదారిపై ప్రయాణం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఎలా వెళ్తున్నామో కాదు.. ఎదురు వచ్చే వారు ఏటు వైపు నుంచి వస్తున్నారో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా.. ఎదురుగా వచ్చే వాహనం ఢీ కొడుతుంది. అలా వాహనదారుడి ప్రమేయం లేకుండానే ప్రమాదం జరుగుతుంది. ఇలాంటి ప్రమాదాలు ప్రపంచంలో ఎక్కడో అక్కడ.. ఎప్పుడో అప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ పొందాలనే పిచ్చి బాగా పెరిగిపోయింది.
నడి రోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ.. ప్రమాదానికి గురవుతున్నారు. అలాంటి ఓ వీడియ వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి రోడ్డు మీద బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా అతడు తన బ్యాలెన్స్ కోల్పోయి.. నడి రోడ్డుపై పడిపోయాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ వీడియోలో ఏముందంటే..?
ఓ రైడర్ బైక్‌పై వేగంగా వెళ్లున్నాడు. ఆ రైడర్ ఉత్సాహంతో.. బైక్ ముందు చక్రాన్ని గాలిలోకి లేపాడు. ఆ వెంటనే అతడు తన బ్యాలెన్స్ కోల్పోయాడు. మరుక్షణమే అతడు రోడ్డుపై పడిపోయాడు. బైక్ చాలా దూరం ఈడ్చుకుపోయింది. రోడ్డుపై నిప్పురవ్వలు కూడా ఎగిసిపడ్డాయి. అయితే ఆ సమయంలో రోడ్డుపై భారీ వాహనాలు రాకపోవడంతో అతడు బతికాడు. అతడు పడిపోయిన వెంటనే.. కాలికి వేసుకున్న చెప్పు కూడా గాలిలోకి ఎగిరి కొంత దూరంలో పడింది.
ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హెల్మెట్ లేదా రైడ్ జాకెట్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఇలా బైక్ మీద స్టంట్ చేయడాన్ని వారంతా విమర్శిస్తున్నారు. రహదారిపై ఇలా స్టంట్ చేయడం వల్ల మీతోపాటు ఇతరులకు కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.